ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: బర్త్‌డే రోజున సాలీడు తెచ్చిన లక్.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షల చొప్పున ఆదాయం..

ABN, First Publish Date - 2023-09-12T16:54:23+05:30

బ్రిటన్‌కు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలికి అదృష్టం ఊహించని విధంగా కలిసొచ్చింది. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు చొప్పున ఆదాయం ఇచ్చే లాటరీ దక్కింది.

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలికి(Britain woman) అదృష్టం ఊహించని విధంగా కలిసొచ్చింది. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు చొప్పున ఆదాయం ఇచ్చే లాటరీ( Winning Lottery on Birthday) దక్కడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.

ఇంగ్లండ్‌లోని డోర్కింగ్ ప్రాంతానికి చెందిన డోరిస్ స్టాన్‌బ్రిడ్జి ఇటీవలే తన 70వ పుట్టిన రోజు జరుపుకుంది. అయితే, ఆ రోజున ఆమెకు తన ఇంటి ఎదురుకుండా ఉన్న పచ్చికలో మనీ స్పైడర్(Money Spider) అనే ఓ రకం సాలీడు కనిపించింది. ఆ సాలీడు కనిపించిన రోజు ఆర్థికలాభం చేకూరుతుందని అక్కడి వారి నమ్మకం. అందులోనూ ఆ రోజు తన పుట్టిన రోజు కావడంతో డోరిస్ లాటరీ టిక్కె్ట్టు కొనింది. ఆ తరువాత ఆ విషయాన్నే మర్చిపోయింది.


ఇటీవల ఓ రోజున ఆమెకు లాటరీ నిర్వహకుల నుంచి మెయిల్ వచ్చింది. డోరిస్ లాటరీ గెలుచుకుందని దాని సారాంశం. అయితే, తాను ఏ వందో రెండొందలో గెలుచుకుని ఉంటానని తొలుత ఆమె భావించింది. కానీ లేఖ అసాంతం చదివేసరికి ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. తనకు నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం(10 thousand pounds a month over the next 30 years) వచ్చేలా లాటరీ తగిలిందని తెలిసి ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.

లాటరీ ఇచ్చిన స్ఫూర్తితో తనకు ప్రస్తుతం మరో 30 ఏళ్లు బతకాలని కోరిక కలుగుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ డబ్బుతో తొలుత తన స్నేహితులు, బంధువులందరితో కలిసి విదేశీ టూర్ వేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక టూర్ తరువత, ప్రసాంత వాతావరణం ఉండే గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కొనుక్కుంటానని కూడా డోరిస్ చెప్పుకొచ్చింది. భార్యకు అంత పెద్ద లాటరీ దక్కడంతో ఆమె భర్త కూడా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం యావత్ బ్రిటన్‌లో వైరల్‌గా(Viral News) మారింది.

Updated Date - 2023-09-12T16:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising