Online Dating: ఎవరితో పడితే వారితో డేటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఓ యువతి పిలిచింది కదా అని వెళ్లిన యువకుడికి ఏమైందంటే..!
ABN, First Publish Date - 2023-11-15T13:33:40+05:30
డేటింగ్ కు వెళితే నా పరిస్థితి ఇలా అయ్యిందంటూ ఆ కుర్రాడు తన గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నాడు.
కొత్తవ్యక్తులతో పరిచయం, వారితో సరదాగా గడపడం పట్ల చాలామంది యువతీయువకులు ఆసక్తిగా ఉంటారు. కొత్త అనుభూతుల కోసం వారి వెంపర్లాట కారణంగా కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లలో పరిచయమయ్యే వ్యక్తుల జెండర్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ కుర్రాడికి ఆన్లైన్ ప్లాట్ పామ్ లో ఓ యువతి పరిచయం అయింది. ఆమె డేటింగ్ కు రమ్మని పిలవగా కుర్రాడు ఎగిరి గంతేశాడు. చాలా ఊహించుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత అతనికి ఎదురైన అనుభవం చాలా షాకింగ్ గా ఉంది. డేటింగ్ కు వెళితే నా పరిస్థితి ఇలా అయ్యిందంటూ ఆ కుర్రాడు తన గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నాడు. ఈ సంఘటన గురించి విన్న నెటిజన్లు విస్తుపోతున్నారు. 'ఎవరితో పడితే వారితో డేటింగ్ కు వెళ్లకూడదు ఇందుకే..' అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం పూణెలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుర్రాడికి బంబుల్ అనే ఆన్లైన్ డేటింగ్ యాప్(bumble online dating app) లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుర్రాడిని డేటింగ్ కు ఆహ్వానించింది. అమ్మాయి తనకు తాను డేటింగ్ కు పిలిచేసరికి కుర్రాడు తబ్బిబ్బయిపోయాడు. వెంటనే ఆమెకు తన అంగీకారం తెలిపాడు. వారిద్దరూ ఎక్కడ కలుసుకోవాలనే విషయాన్ని ఆ అమ్మాయే నిర్ణయించింది. దాని ప్రకారం పూణేలోని జిప్సీ రెస్ట్రో బార్ లో వారిద్దరూ కలుసుకున్నారు. తదనంతరం ఆ అమ్మాయి బార్ లో ఒక వైన్ బాటిల్ ఆర్డర్ చేసింది. వారిద్దరూ మద్యం తీసుకున్న తరువాత బేరర్ వచ్చి బిల్ ఇచ్చి వెళ్లాడు. ఆ బిల్ పేపర్ తెరచి చూసిన అతను షాకయ్యాడు.
ఇది కూడా చదవండి: Breastfeeding: పాలిచ్చే తల్లులు అస్సలు చేయకూడని 9 పనులివే..!
బార్ లో ఆ కుర్రాడు అందుకున్న బిల్ లో ఒక వైన్ బాటిల్ ధర 15వేలు(wine bottle 15thousand), వైన్ తాగడానికి ఉపయోగించిన వైన్ గ్లాస్ ధర 10వేలుగా(wine glass 10thousand) ఉంది. అది తప్పేమోననే సందేహం అతనికి వచ్చింది. దాంతో అక్కడి వారిని పిలిచి బిల్లు గురించి ఫిర్యాదు చేశాడు. ఆ బిల్లు తప్పుగా ఏమీ లేదని అది సరైనదేనని వారు చెప్పడంతో కుర్రాడికి దిమ్మ తిరిగిపోయింది. వైన్ బాటిల్ ధర, వైన్ గ్లాస్ ధర అంత ఏంటని ఆ కుర్రాడు అక్కడ గొడవ పడడానికి సిద్దమయ్యాడు. కానీ అతనితో డేటింగ్ కు వచ్చిన యువతి అతన్ని వారించింది. బార్ వారితో గొడవ పడితే తాము వచ్చిన కార్లను బార్ సిబ్బంది పాడు చేసే అవకాశం ఉంటుందని, బిల్లు కట్టేయమని చెప్పింది. బార్ సిబ్బంది కూడా కుర్రాడిని బెదిరించారు. దీంతో ఆ కుర్రాడు బలవంతంగా 22వేల రూపాయల బిల్లు కట్టి అక్కడి నుండి బయటపడ్డాడు. జరిగిన సంఘటన మొత్తం ట్విట్టర్ లో షేర్ చేసుకోగా నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలామంది డేటింగ్ కు వచ్చిన యువతి మీద అనుమానం వ్యక్తం చేశారు. 'బార్ యజమానులు ఆ యువతిని అద్దెకు తీసుకుని ఈ డ్రామా ఆడి ఉంటారు ' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆన్లైన్ బెట్టింగ్ లే కాదు, ఆన్లైన్ డేటింగ్ లు కూడా కొంప ముంచుతాయి' అని మరొకరు కామెంట్ అన్నారు.
ఇది కూడా చదవండి: Lady Finger vs Diabetes: చక్కెర వ్యాధికి, బెండకాయలకు అసలు లింకేంటి..? చాలా మందికి తెలియని నిజాలివీ..!
Updated Date - 2023-11-15T13:33:42+05:30 IST