Viral Video: వామ్మో.. పాకిస్థానీలు ఇలా ఆలోచిస్తారా? భారతీయుల్లో ఆశ్చర్యం!
ABN, First Publish Date - 2023-10-08T20:47:42+05:30
కశ్మీర్ ఎవరిదో ఓ పాకిస్థానీ తేల్చిచెప్పాడు. అతడి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ అంశంలో తరచూ పాకిస్థానీ నేతల ప్రగల్భాలు వైరల్ అవుతూనే ఉంటాయిగానీ అక్కడ సగటు పౌరుడి అభిప్రాయానికి అంతగా ప్రచారం లభించదు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ తన గొంతు వినిపించే అవకాశం దక్కుతోంది. దీంతో, ఎక్కడెక్కడి వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కశ్మీర్‌పై ఓ సగటు పాకిస్థానీ అభిప్రాయం ఏంటో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.
Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కశ్మీర్ ఎవరిదని ఓ యాంకర్ ఓ పాకిస్థానీని ప్రశ్నిస్తుంది. దీనిక అతడు కాస్తంత తుంటరిగా కశ్మీరీలదని జవాబిచ్చాడు(Pakistani answers as to who owns kashmir). అదేంటి..కశ్మీర్ మనదేనని మనం అంటుంటాం కదా అని యాంకర్ ఎదురు ప్రశ్నిస్తుంది. అలా ఎప్పుడు జరిగింది.. అక్కడ ఉన్నది భారత్ సైన్యం కాబట్టి, అది భారత్‌దే అని ఆ పాకిస్థానీ జవాబిచ్చాడు. అప్పుడు యాంకర్ కల్పించుకుని.. అక్కడ పాకిస్థాన్ సైన్యం కూడా ఉందన్న విషయం చెబుతుంది. కశ్మీర్ భూభాగంలో 30 శాతం పాకిస్థాన్ చేతిలో ఉందని 10 శాతం చైనా వద్ద ఉందని మిగిలిన భాగం ఇండియాదని చెబుతుంది. ఇలా చూసినా కశ్మీర్ ఇండియాదేనని అతడు మరోసారి చెబుతాడు. ఇక్కడ తిండికే ఇక్కట్ల పాలవుతుంటే కశ్మీర్ ఎక్కడ సొంతం చేసుకోగలమని సూటి వ్యాఖ్యలు చేశాడు.
Metro: ప్రయాణికుడికి ఊహించని షాకిచ్చిన మెట్రో! అతడు చేసిన తప్పేంటంటే..
మరి నిజం ఏంటో మీకూ తెలుసు మాకూ అయినా కశ్మీర్ పాకిస్థాన్‌దేనని మనమెందుకు గొంతెత్తుతాం అని యాంకర్ ప్రశ్నించింది. దీంతో, అతడు ఏమాత్రం తడుముకోకుండా మనమంతా పిచ్చోళ్లమని చెప్పేస్తాడు. దీంతో యాంకర్ నోరెళ్లబెడుతుంది. ఏంటీ.. మనం పిచ్చోళ్లమైపోయామా.. అంటే 70 ఏళ్లుగా మనం ఇలా పిచ్చోళ్లలాగానే ఉన్నామా? అని ఆమె ప్రశ్నిస్తుంది. దీంతో, తరతరాలుగా రాజకీయ నాయకులు మనల్ని పిచ్చోళ్లను చేస్తున్నారంటూ అతడు వివరణ ఇచ్చాడు. తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే కశ్మీర్ ఎక్కడ సాధిస్తామని కుండ బద్దలు కొట్టాడు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని, వ్యాపారకార్యకలాపాలు కుంటుపడ్డాయంటూ విచారం వ్యక్తం చేశాడు.
ఈ వీడియో చూసిన భారతీయులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రతి పాకిస్థానీ ఇలాగే ఆలోచిస్తే రెండు దేశాలకూ సమస్యలు ఉండవని కామెంట్ చేస్తున్నారు. అక్కడి వారు ఇలా ఆలోచిస్తున్నారా? అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ
Updated Date - 2023-10-08T20:53:22+05:30 IST