ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జంతువులో అంత గొప్పదనం ఏముందని... అంతలా అక్రమ రవాణా అవుతోంది?.. ఒక్కో జంతువు ఖరీదెంతంటే...

ABN, First Publish Date - 2023-04-30T11:24:26+05:30

అరుదైన జంతువుల అక్రమ రవాణా విరివిగా జరుగుతుంటుంది. వాటిలో ఒకటే పాంగోలిన్(Pangolin). అంటే అలుగు. పర్యావరణ పరిశోధనా సంస్థ (EIA) తన నివేదికలలో పాంగోలిన్ అనే అడవి జంతువుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన జంతువుల అక్రమ రవాణా విరివిగా జరుగుతుంటుంది. వాటిలో ఒకటే పాంగోలిన్(Pangolin). అంటే అలుగు. పర్యావరణ పరిశోధనా సంస్థ (EIA) తన నివేదికలలో పాంగోలిన్ అనే అడవి జంతువుకు సంబంధించిన పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. పాంగోలిన్ శరీరంతో తయారు చేసిన ఉత్పత్తులను పలు ఆన్‌లైన్ సైట్‌లు(Online sites) విక్రయిస్తున్నాయని ఈ ఏజెన్సీ ఆరోపించింది.

వీటిలో ఔషధాలను(Medicines) విక్రయించే వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. పాంగోలిన్ కీటకాలను తినే క్షీరద జంతువు. ఈ ప్రత్యేక జీవి ఆఫ్రికా, ఆసియాలోని దట్టమైన అడవులలో కనిపిస్తుంది. చూసేందుకు ఇవి సరీసృపాలల(Reptiles) మాదిరిగా కనిపిస్తాయి. పాంగోలిన్ నాలుక సుమారు 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఆ నాలుక సహాయంతో చీమలు, చెదపురుగులు, చిన్న కీటకాలను తింటుంది. ఒక పాంగోలిన్ ప్రతి సంవత్సరం సుమారు 70 మిలియన్ కీటకాలను(Insects) తింటుంది.

ప్రపంచంలో దాదాపు 8 రకాల పాంగోలిన్‌లు ఉన్నాయి. వాటిలో ఐదు జాతులు రాబోయే కాలంలో అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు(Researchers) చెబుతున్నారు. ఈ జంతువును స్మగ్లింగ్ చేసి, చంపడంలో చైనా ముందుంది. చైనాలో సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ (TCM)లో అలుగు శరీర భాగాలను వినియోగిస్తుంటారు. అలాగే నూనెను కూడా తయారు చేస్తుంటారు. 1960 నుండి ఇప్పటివరకూ చైనాలోని అడవుల(Forests) నుండి 90% శాతానికి మించిన పాంగోలిన్‌లు హతమయ్యాయి.

మందుల తయారీ కోసం ఇప్పుడు పాంగోలిన్‌లను వియత్నాం(Vietnam), ఆఫ్రికా అరణ్యాల్లో వేటాడుతున్నారు. అంతర్జాతీయ బ్లాక్‌ మార్కెట్‌లో వీటిని భారీ మొత్తానికి విక్రయిస్తున్నారు. ఒక కిలో ఇండియన్ పాంగోలిన్ స్కిన్ ధర ఒక లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. ఒక పూర్తి పాంగోలిన్‌ను(Pangolin) రూ. 10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

Updated Date - 2023-04-30T11:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising