PawanKalyanOnAHA: బాబోయ్... ఆహాలో రాకముందే దున్నేస్తున్న పవనేశ్వరుడు !

ABN, First Publish Date - 2023-02-02T16:18:53+05:30

ఈ షో ఇంకా ఈరోజు రాత్రి (ఫిబ్రవరి 2) 9 గంటలకి ప్రసారం కానుంది, కానీ ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే కొన్ని లక్షల మంది చూసి చరిత్ర సృషించింది. అసలు ప్రపంచ లో ఏ టాక్ షో కి లేనంత క్రేజ్ ఈ ఒక్క ఎపిసోడ్ కి (NBK Pawan Kalyan) వచ్చింది అనిపిస్తోంది.

PawanKalyanOnAHA: బాబోయ్... ఆహాలో రాకముందే దున్నేస్తున్న పవనేశ్వరుడు !
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'అన్ స్థాపబుల్ విత్ ఎన్.బి.కె' (Unstoppable with NBK) రెండో సీజన్ ఇప్పుడు పూర్తి కావస్తోంది. ఈ రెండో సీజన్ లో చాలామంది సినిమా, రాజకీయ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు వచ్చారు ఈ షోకి. ఇప్పుడు ఈ చివరి ఎపిసోడ్ కి నటుడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ (PawanKalyanOnAHA) వచ్చారు. ఇది రెండు భాగాల్లో ప్రసారం కానుంది. అయితే ఎక్కడ లేనటువంటి విధంగా ఈ షో కి విపరీతమయిన క్రేజ్ వచ్చింది. ఈ షో ఇంకా ఈరోజు రాత్రి (ఫిబ్రవరి 2) 9 గంటలకి ప్రసారం కానుంది, కానీ ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే కొన్ని లక్షల మంది చూసి చరిత్ర సృషించింది. అసలు ప్రపంచ లో ఏ టాక్ షో కి లేనంత క్రేజ్ ఈ ఒక్క ఎపిసోడ్ కి (NBK Pawan Kalyan) వచ్చింది అనిపిస్తోంది.

nbk-pk1.jpg

పవన్ కళ్యాణ్ తన సినిమాలో అంటూ ఉంటాడు కదా, 'నేను ట్రెండ్ ని ఫాలో అవను, ట్రెండ్ ని సెట్ చేస్తా' అది సినిమాలో డైలాగ్ అనుకుంటాం కానీ, నిజ జీవితం లో కూడా ఇంత ట్రెండ్ ని సృష్టిస్తాడని ఎవరూ ఊహించి వుండరు. ఎందుకంటే సాంఘీక మాధ్యమాల్లో, బయటా ఎక్కడ విన్నా, చూసిన ఈ ఎపిసోడ్ గురించే టాక్ నడుస్తోంది, ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ లో కొన్ని గంటల వ్యవధిలోనే లక్ష ట్వీట్స్ దిశగా #PawanKalyanOnAHA హ్యాష్ టాగ్ రచ్చ చేస్తోందంటే పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దానికి తోడు ప్రోమోలో అడిగిన సరదా ప్రశ్నలు, కొన్ని సీరియస్ సమాధానాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ PawanKalyanOnAHA ఒకటేమిటి అన్నీ చాలా ఆసక్తికరంగా ఉండటం కూడా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కి ముందే ఇంతలా ట్రెండ్ అవడానికి దోహదపడింది. పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కోవడానికి, అతను ఏమి చెప్తాడో అని వినడానికి అతని అభిమానులే కాకుండా, సామాన్య ప్రేక్షకుల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇది ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ప్రసాబ్ ల్యాబ్ లోని, ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో అభిమానుల కోసం ఒక PawanKalyanOnAHA ప్రత్యేక షో కూడా వుంది అని అంటున్నారు. ఇదే కాకుండా చాలా ప్రదేశాల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారని కూడా తెలిసింది. ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ షో సీజన్ రెండు కి ఒక అద్భుతమయిన ముగింపు ఇస్తున్నాడని చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ ముందు వచ్చిన ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో చూసారు, అయితే ఆ రికార్డులను బద్దలు PawanKalyanOnAHA కొట్టే దిశగా పవన్ ఎపిసోడ్ ఉండబోతోందని టాక్.

Updated Date - 2023-02-02T16:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising