Train Ticket: చేతిలో డబ్బు లేకపోయినా ట్రైన్.. పేటీఎం అదిరిపోయే ఆప్షన్.. ఇలా చేస్తే చాలు..
ABN, First Publish Date - 2023-05-09T17:44:39+05:30
ఒక్కోసారి ఎలాంటి వ్యక్తులకైనా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతిలో డబ్బుల్లేక అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులను వాయిదా వేయాల్సి ఉంటుంది. అయితే రైలు ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది పేటీఎం పోస్ట్ పేయిడ్.
ఒక్కోసారి ఎలాంటి వ్యక్తులకైనా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతిలో డబ్బుల్లేక అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులను వాయిదా వేయాల్సి ఉంటుంది. అయితే రైలు ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది పేటీఎం పోస్ట్ పేయిడ్ (Paytm post paid)
టికెట్ కొనేందుకు డబ్బులు లేకున్నా రైలు (Train) ప్రయాణానికి వీలుగా పేటీఎం పేమెంట్ (Paytm payment) అదిరిపోయే అవకాశాన్ని ప్రకటించింది. ‘పేటీఎం పోస్ట్ పేయిడ్’ ద్వారా ‘‘ బుక్ నౌ, పే లేటర్ ’’ (Buy now, Pay Later) ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అంటే డబ్బులు లేకుండానే టికెట్ కొనుగోలు చేసి ఆ తర్వాత చెల్లించవచ్చు. కస్టమర్లు 30 రోజుల కాలవ్యవధికిగానూ రూ.60,000 వరకు వడ్డీలేని రుణాన్ని తీసుకోవచ్చు. రుణాన్ని ఉపయోగించి చేసిన కొనుగోళ్ల మొత్తాన్ని కలిపి ఒకేసారి నెలవారీ బిల్లును కస్టమర్లకు పంపిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
పేటీఎం పోస్ట్ పేయిడ్ ఉపయోగించి ఐఆర్‌సీటీసీపై టికెట్ బుక్ చేయండిలా...
Step 1: ఐఆర్‌సీటీసీ పోర్టల్ ఓపెన్ చేసి.. అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
Step 2: ప్రయాణ గమ్యం, తేదీ సహా జర్నీకి సంబంధించిన వివరాలన్నింటినీ పొందుపరచాలి.
Step 3: టికెట్ బుకింగ్ ప్రక్రియను కొనసాగించాలి.
Step 4: పేమెంట్ సెక్షన్ కింద ‘పే లేటర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘పేమెంట్ పోస్ట్‌పెయిడ్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
Step 5: చివరిగా పేటీఎం వివరాలను ఉపయోగించి ఓటీపీ ఉపయోగించాలి.
Updated Date - 2023-05-09T17:44:58+05:30 IST