స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతున్నప్పుడు టాయిలెట్ వస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? దీని వెనుకనున్న కారణం ఇదే...
ABN, First Publish Date - 2023-05-06T09:35:22+05:30
స్విమ్మింగ్ అనేది ఒక గొప్ప వ్యాయామం. ఫిట్‌గా ఉండేందుకు చాలామంది స్విమ్మింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే స్విమ్మింగ్ పూల్(Swimming pool)లో ఎక్కువ సేపు ఉన్నప్పుడు, మనిషి బ్లాడర్ యాక్టివ్‌గా మారుతుంది.
స్విమ్మింగ్ అనేది ఒక గొప్ప వ్యాయామం. ఫిట్‌గా ఉండేందుకు చాలామంది స్విమ్మింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే స్విమ్మింగ్ పూల్(Swimming pool)లో ఎక్కువ సేపు ఉన్నప్పుడు, మనిషి బ్లాడర్ యాక్టివ్‌గా మారుతుంది. అప్పుడు మూత్ర విసర్జన(urination) చేయాలనే కోరిక కలుగుతుంది. ఫలితంగా చాలామంది స్విమ్మింగ్ పూల్‌లో మూత్ర విసర్జన చేస్తుంటారు. ఈ విషయంలో సైన్స్ ఏమి చెబుతున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. 110,000 గాలన్ల నీరు కలిగిన స్విమ్మింగ్ పూల్‌లో 8 గ్యాలన్ల మూత్రం(8 gallons of urine) ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. అంటే స్విమ్మింగ్ పూల్‌లో మునిగితేలేవారిలో చాలామంది అందులోనే మూత్ర విసర్జన చేస్తారని వెల్లడయ్యింది.
ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్విమ్మింగ్ పూల్‌లో కొంత సమయం గడిపిన తర్వాత మూత్రాశయం(Urinary bladder) మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అప్పుడు మూత్ర విసర్జనను నియంత్రించలేరు. మెంటల్ ఫ్లాస్(Mental floss)లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ఇమ్మర్షన్ డైయూరిసిస్(Immersion diuresis) కారణంగా ఈ విధంగా జరుగుతుంది. వాస్తవానికి ఈ పరిస్థితి శరీరంలో తలెత్తినప్పుడు మూత్రాన్ని నియంత్రించలేకపోతారు. స్విమ్మింగ్ పూల్‌లోనే మూత్ర విసర్జన చేస్తారు.
ఎక్కువ సేపు నీటిలో ఉండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తి, రక్తం శరీర అంతర్గత అవయవాలకు త్వరగా పంపింగ్(pumping) జరుగుతుంది. ఇది రక్తపోటును కూడా పెంచుతుంది. ఫలితంగా కిడ్నీలు యాక్టివ్‌గా మారుతాయి. దీంతో శరీరం లోపలి ద్రవాన్ని వేగంగా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా మూత్ర విసర్జన వెంటనే జరుగుతుంది. నీటిలో లోతుగా డైవ్ చేసినప్పుడు ఇమ్మర్షన్ డైయూరిసిస్ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. నీటి పీడనం(Water pressure) పెరిగిన వెంటనే, రక్తపోటు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో మూత్రపిండాలు(Kidneys) శరీరంలోని నీటిని వేగంగా ఫిల్టర్ చేయడం ప్రారంభిస్తాయి.
అటువంటి పరిస్థితిలో వెంటనే మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంది. చల్లటి నీటిలో(cold water) కూడా ఇలానే జరుగుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తున్నప్పుడు కూడా మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంది. ఒలింపిక్ స్విమ్మర్లు(Olympic swimmers) కూడా తాము పూల్‌లో మూత్ర విసర్జన చేసినట్లు చెబుతుంటారు.
Updated Date - 2023-05-06T12:23:40+05:30 IST