ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చేతిలో సంచీ పట్టుకుని.. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ బైక్‌పై మార్కెట్‌కు వెళ్తున్న ఇతడెవరో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-05-23T14:31:36+05:30

సాధారణంగా సెలబ్రిటీలంటే పెద్ద హంగు, ఆర్భాటం ఉంటుంది. పెద్ద బంగళా, కార్లు, ఇంటి నిండా పని వారు ఉంటారు. సెలబ్రిటీలు సాధారణ మనుషుల్లా ఇంటి పనులు చేయడం, బయటకు వెళ్లి కూరగాయలు తేవడం వంటివి ఊహకు కూడా అందని విషయాలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా సెలబ్రిటీలంటే పెద్ద హంగు, ఆర్భాటం ఉంటుంది. పెద్ద బంగళా, కార్లు, ఇంటి నిండా పని వారు ఉంటారు. సెలబ్రిటీలు సాధారణ మనుషుల్లా ఇంటి పనులు చేయడం, బయటకు వెళ్లి కూరగాయలు తేవడం వంటివి ఊహకు కూడా అందని విషయాలు. వారు బయటకు వస్తే బోలెడంత మంది జనం గుమిగూడిపోతారు. దీంతో వారు బౌన్సర్లు, సెక్యూరిటీ లేకుండా బయటకు రారు. అయితే బాలీవుడ్ (Bollywood) పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్ (Arijit Singh) మాత్రం ఇలాంటి వాటన్నింటికీ భిన్నం.

అర్జిత్ సింగ్ ఎంత సంపాదిస్తున్నా తన మూలాలను మాత్రం మరచిపోలేదు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ అర్జిత్ సింగ్ స్వస్థలం. వీలు దొరికినప్పుడల్లా అర్జిత్ ముంబై నుంచి ముర్షిదాబాద్ వెళ్తుంటాడు. అక్కడకు వెళ్లాక ఓ సామాన్యుడిలా జీవనం సాగిస్తాడు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే అది నిజమేనని ఒప్పుకోవాల్సిందే. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అర్జిత్ సింగ్ సామాన్య గృహస్థుడిలా బనియన్, లుంగీ కట్టుకుని ఓ సంచి పట్టుకుని షాపింగ్‌కు బయల్దేరాడు. తన బైక్ స్టార్ట్ చేస్తూ చుట్టు పక్కల వారితో బెంగాలీలో మాట్లాడుతున్నాడు.

Birde Viral Video: ఈమెను పెళ్లి చేసుకోబోయేది ఎవరో కానీ.. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నెట్టింట ఫన్నీ సెటైర్లు.. ఇంతకీ అసలు కథేంటంటే..!

ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఓ సామాన్యుడిలా జీవిస్తున్న అర్జిత్ సింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే అర్జిత్ పాటలు గుండె లోతుల్లో నుంచి వచ్చినట్టు ఉంటాయని ఒకరు కామెంట్ చేశారు. అర్జిత్ సింగ్ తల్లి బెంగాలీ కాగా, తండ్రి పంజాబ్‌కు చెందిన సిక్కు. అర్జిత్ కుటుంబం ముర్షిదాబాద్‌‌లో స్థిరపడింది.

Updated Date - 2023-05-23T14:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising