ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో ఇస్లామిక్ పాలనకు పీఎఫ్‌ఐ కుట్ర... ఎన్ఐఏ ఛార్జిషీటులో సంచలన వివరాలు!

ABN, First Publish Date - 2023-03-18T09:57:09+05:30

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) దాని లక్ష్యాలను సాధించడానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేసిందని. దాని సొంత కోర్టు అయిన దారుల్ కజా తీర్పులను అమలు చేయడానికి శిక్షణ(Training) పొందిన కార్యకర్తలను ఉపయోగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టుకు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) దాని లక్ష్యాలను సాధించడానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేసిందని. దాని సొంత కోర్టు అయిన దారుల్ కజా తీర్పులను అమలు చేయడానికి శిక్షణ(Training) పొందిన కార్యకర్తలను ఉపయోగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టుకు తెలిపింది. కొచ్చిలోని ప్రత్యేక కోర్టు(Special Court)లో సమర్పించిన ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌(NIA Charge Sheet)లో ప్రధానంగా గత ఏడాది సెప్టెంబర్‌లో కేరళ, ఇతర రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ సభ్యులపై ఆ సంస్థ జరిపిన దాడుల వివరాలున్నాయి.

ఈ దాడుల తర్వాత చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(Union Home Ministry) ఐదేళ్లపాటు రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సహా PFI, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించింది. గతేడాది జరిగిన దాడులకు సంబంధించి తమిళనాడులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. “పీఎఫ్‌ఐ అత్యంత చురుగ్గా ఉన్న రెండు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులలో దాఖలు చేసిన ఛార్జిషీట్లు పిఎఫ్‌ఐ పన్నిన వేర్వేరు నేరపూరిత కుట్రలకు సంబంధించినవి. ముస్లిం యువతను(Muslim youth) ఆకర్షించి ఆయుధాలు ఉపయోగించడంలో వారికి శిక్షణ ఇవ్వడం, ఉగ్రవాద చర్యలకు నిధులు సమీకరించడం, 2047 నాటికి భారతదేశంలో(India) ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే అంతిమ లక్ష్యం(ultimate goal)తో హింసకు పాల్పడుతున్నదని’’ NIA ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నైలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌(Charge sheet)లో తమిళనాడు గ్రూపు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ మహ్మద్‌తో సహా 10 మంది పిఎఫ్‌ఐ సభ్యులను నిందితులుగా పేర్కొన్నారు.

అలాగే కొచ్చిలో నిషేధిత సంస్థకు చెందిన 58 మంది సభ్యులను అరెస్టు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లతో పాటు యూఏపీఏ, ఆయుధ చట్టం కింద అభియోగాలు మోపారు. కేరళ ఛార్జిషీట్‌లో PFI కేరళ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సతార్(Abdul Sattar), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాహియా తంగల్, ఎర్నాకులం జోనల్ కార్యదర్శి షిహాస్ MH మరియు PFI రాజకీయ విభాగం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PK ఉస్మాన్ పేర్లు ఉన్నాయి. కేరళ దాడుల కేసు(Kerala attacks case)ను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఎ శ్రీనివాసన్ హత్యకు సంబంధించినది.

పీఎఫ్‌ఐ సభ్యులు(Members of PFI) ఇతనిని గత సంవత్సరం నరికి చంపారనే ఆరోపణలు ఉన్నాయి. రెండు కేసులలో పీఎఫ్‌ఐ సభ్యులు నిందితులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. పీఎఫ్ఐ “రిపోర్టర్స్ వింగ్, ఫిజికల్ అండ్ ఆర్మ్స్ ట్రైనింగ్ వింగ్, సర్వీస్ టీమ్‌ల వంటి విభాగాలను ఏర్పాటు చేసిందని, ఫిజికల్ ఎడ్యుకేషన్(Physical Education), యోగా” ముసుగులో ఆయుధ శిక్షణ(Weapons training) ఇస్తున్నదని దర్యాప్తులో తేలిందని NIA తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Updated Date - 2023-03-18T10:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising