ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Philophobia: ఫిలోఫోబియా బాధితుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఎందుకు ఉంటున్నారంటే..

ABN, First Publish Date - 2023-03-28T13:16:53+05:30

సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం..! హీరోయిన్ తొలుత హీరోతో ప్రేమలో పడకూడదని గట్టిగా నిశ్చయించుకుంటుంది. ‘‘నేను ప్రేమలో పడిపోతానేమో..’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం..! హీరోయిన్ తొలుత హీరోతో ప్రేమలో పడకూడదని గట్టిగా నిశ్చయించుకుంటుంది. ‘‘నేను ప్రేమలో పడిపోతానేమో..’’ అంటూ ఆందోళన చెందుతుంది. ఇలా ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారేమో.. అని పదేపదే ఆలోచించడం ఓ మానసిక ఆందోళన(Anxiety) అని నిపుణులు చెబుతున్నారు. సైకాలజీ(Psychology) పరిభాషలో ఈ ఆందోళనను ఫిలోఫోబియా(Philophobia) అని పిలుస్తారు.

ఏమిటీ ఫిలోఫోబియా?

తమను ఎవరూ ప్రేమించడం లేదని మానసికంగా కుంగుబాటు(Depression), తాము ప్రేమలో పడిపోతామేమోనని ఆందోళన చెందడాన్ని(Fear of falling in love) ఫిలోఫోబియా అంటారు. ఇలాంటి వారిలో ప్రేమ(Love)కు సంబంధించిన భావోద్వేగ(Emotional) అనుబంధం గురించి అహేతుకమైన(Irrational) ఆందోళన ఉంటుంది. వీరి దృష్టిలో ప్రేమ అనేది మనసుకు సంబంధించినది కాదని, ఎదుటివారు శారీరక(Physical) సంబంధాల కోసమే ప్రేమ పేరుతో వల(Trap) వేస్తారనే బలమైన అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం క్రమంగా బలపడి.. భయాందోళన(Fear)కు దారి తీస్తుంది. ఇది ముదిరి తీవ్రమైన ఆందోళన(Anxiety)గా.. ఫిలోఫోబియాగా మారుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ స్థితికి చేరుకున్నవారు సామాజికంగా(Socially), మానసికంగా(Mentally) ఒంటరితనాన్ని(Loneliness) ఇష్టపడతారని, నిరాశ, ఇతర భావోద్వేగాలకు గురవుతారని పేర్కొన్నారు.

ఎలాంటి వారిలో ఈ ఫోబియా??

ఫిలోఫోబియాకు కారణాలనేకం ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ‘‘సామాజిక పరిస్థితులు(Social Conditions), మహిళలపై జరుగుతున్న నేరాలు(Crime against Women), ప్రేమ పేరుతో రోజూ వార్తల్లో కనిపిస్తున్న మోసాలు వంటివి యువతను ప్రభావితం చేస్తాయి. ఫిలోఫోబియా అనేది యువకులు, యువతులకు అతీతం కాదు. అయితే.. ఎక్కువగా యువతులు ప్రభావితమవుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఫోబియా బాధితుల సంఖ్య పెరుగుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి’’ అని యశోద ఆస్పత్రిలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ ప్రజ్ఞా రష్మి (Dr. Pragya Rashmi) ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. స్కూలు, కాలేజీ విద్యార్థినుల్లో ఈ సమస్య అధికమని ఆమె వివరించారు. ‘‘స్కూలులో ఎవరైనా అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండి.. తమకు లేరనే ఆత్మన్యూనత భావం కూడా ఫిలోఫోబియాకు దారితీస్తుంది. ఈ కేటగిరీకి చెందిన వారు తమను ఎవరూ ప్రేమించడం లేదని, తాము అందంగా లేమేమోనని మధనపడుతుంటారు. ఎవరూ ప్రేమించడం లేదనే ఆలోచనలు, ఎవరైనా ప్రేమిస్తే.. వారి ప్రేమలో పడిపోతానేమో అనే భయం—ఫిలోఫోబియాకు కారణమవుతాయి’’ అని ఆమె వివరించారు. గత ఘటనలు(Past Trauma), నమ్మకాలు(Beliefs), సాంస్కృతిక(Cultural), మతపరమైన విశ్వాసాలు(Religious Beliefs), వ్యక్తిత్వ లక్షణాలు(Personalities).. ఇలా పలు అంశాలు ఫిలోఫోబియాకు దోహదపడుతున్నాయని చెప్పారు.

భారత్‌లో ఇలా..?

భారత్‌తోపాటు.. పలు దేశాల్లో ఫిలోఫోబియా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని పలు పరిశోధనలు(Research), అధ్యయనాలు(Studies), సర్వేలు(Surveys) చెబుతున్నాయి. అయితే.. ఇది ఓ ఫోబియా అనే విషయం ప్రాచుర్యంలోకి రాకపోవడంతో.. పరిమిత సంఖ్యలో బాధితులపై సర్వేలు జరిగినట్లు తెలుస్తోంది. 2019లో ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ’లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా ఉత్తరభారతంలో 510 మంది అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను సర్వే చేశారు. వారిలో 17.8% మందిలో ఫిలోఫోబియా లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల యువతుల్లో ఈ లక్షణాలు ఎక్కువ అని వెల్లడైంది. 2016లో ‘జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్’లోనూ భారత్‌కు సంబంధించిన ఓ అధ్యయనం ప్రచురితమైంది. దేశవ్యాప్తంగా 1,496 మంది ఈ సర్వేలో పాల్గొనగా.. 2.5% మందిలో పిలోఫోబియా లక్షణాలు బయటపడ్డాయి. అంటే.. భారత్‌లో ఏయేటికాయేడు ఫిలోఫోబియా బాధితుల సంఖ్య పెరుగుతోందని స్పష్టమవుతోంది.

చికిత్స విధానాలేంటి?

భారత్‌లో ఫిలియోఫోబియాపై మరిన్ని పరిశోధనల అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్(DSM-5)లో ఫిలోఫోబియా ప్రత్యేక రుగ్మతగా గుర్తించకున్నా.. మానసిక శాస్త్రవేత్తలు దీన్ని ఆందోళన(Anxiety)గా నిర్ధారించారు. ఫిలోఫోబియాకు సాధారణ చికిత్స ఉంటుంది. లేదా యాంటీడిప్రెసెంట్స్(Antidepressants), యాంటీ-యాంగ్జైటీ(Anti-Anxiety) మందులతో నయం చేయవచ్చు. లేదంటే.. చికిత్సతోపాటు.. నిర్ణీత కాలానికి మందులను వాడాల్సి ఉంటుంది. కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ(CBT) ద్వారా ఫిలోఫోబియాను నయం చేయడం ఒక విధానంగా నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు.. ఎక్స్‌పోజర్ థెరపీ(Exposure Therapy) ద్వారా ఫిలోఫోబియాను నయం చేయవచ్చంటున్నారు.

Updated Date - 2023-03-28T13:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising