ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Police: పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా చేస్తారా.. పై అధికారి భార్యపై ఫిర్యాదు చేసిన పోలీస్ ఆఫీసర్ భార్య.. కారణమేంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-10-09T15:57:04+05:30

సాధారణంగా ఎవైనా సమస్యలు వచ్చినా, ఎవరైనా మోసం చేసినా అందరూ పోలీసులను ఆశ్రయిస్తారు. అయితే కొందరు పోలీసులు తమ అధికారం ఉపయోగించి సామాన్యులను మోసం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ కేసులో ఓ పోలీస్ అధికారి భార్య మరో పోలీస్ ఆఫీసర్ భార్యను మోసం చేసింది.

సాధారణంగా ఎవైనా సమస్యలు వచ్చినా, ఎవరైనా మోసం చేసినా అందరూ పోలీసుల (Police)ను ఆశ్రయిస్తారు. అయితే కొందరు పోలీసులు తమ అధికారం ఉపయోగించి సామాన్యులను మోసం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ కేసులో ఓ పోలీస్ అధికారి భార్య మరో పోలీస్ ఆఫీసర్ భార్యను మోసం (Cheating) చేసింది. ఏకంగా రూ.31 లక్షలకు టోపీ పెట్టింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నవీ ముంబై (Mumbai)లో వెలుగులోకి వచ్చింది (Crime News).

పన్వేల్‌కు చెందిన పూజా దేవి(48), పుష్పలత అనే ఇద్దరు మహిళల భర్తలు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలిసి పని చేస్తున్నారు. పుష్పలత భర్త రమేష్ జాదవ్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. పూజా దేవి భర్త రైల్వేలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. 2019లో జాదవ్, పుష్పలత ఓ వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారం చాలా లాభసాటిగా ఉందని, భారీగా లాభాలు వస్తున్నాయని పూజా దేవికి చెప్పారు. దీంతో పూజా దేవి కూడా ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. పుష్పలత, పూజా దేవి సగం సగం పెట్టుబడితో వ్యాపారం కొనసాగించారు.

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ జామ్.. ప్రేమ పక్షులకు వరం.. మహిళ చేసిన ఫన్నీ ట్వీట్‌పై భారీగా స్పందిస్తున్న నెటిజన్లు!

ముంబై శివార్లలోని మడ అడవులకు రక్షణ గోడ నిర్మించే ప్రాజెక్ట్‌ వచ్చిందని చెప్పి డబ్బు మొత్తం పుష్పలత తీసుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టులో నష్టం వచ్చిందని, మొత్తం లాస్ అయ్యామని తెలిపారు. నిజానికి ఆ ప్రాజెక్టు గురించి పూజా దేవితో వారు చెప్పలేదు. జరిగిన మోసాన్ని గ్రహించిన పూజ దేవి.. పుష్పలతపై రూ.31 లక్షలకు చీటింగ్ కేసు వేసింది. దీంతో పుష్పలత, జాదవ్‌లపై పోలీసులు 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-10-09T15:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising