ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

poveglia island: అక్కడ లక్షకుపైగా జనం సజీవ దహనం.. అడుగడుగునా మానవ అస్తిపంజరాలు... పోవెగ్లియా ద్వీపంలో మృత్యుతాండవం వెనుక...

ABN, First Publish Date - 2023-03-30T07:03:22+05:30

poveglia island: ఇటలీలోని పోవెగ్లియా ద్వీపంలో మృత్యువు నివసిస్తుందని, అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారని చెబుతారు. అందుకే ఈ ద్వీపానికి(island) వెళ్లడానికి ఎవరూ ఎంతమాత్రం సాహసించరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

poveglia island: ఇటలీలోని పోవెగ్లియా ద్వీపంలో మృత్యువు నివసిస్తుందని, అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారని చెబుతారు. అందుకే ఈ ద్వీపానికి(island) వెళ్లడానికి ఎవరూ ఎంతమాత్రం సాహసించరు. అయితే ధైర్యం చేసి వెళ్లిన వారిలో కొందరు తిరిగి రాలేక పోయారట. ఈ దీవి శాపగ్రస్తమైందని(Cursed) చెబుతుంటారు. ఇక్కడ వింత స్వరాలు వినిపిస్తుంటాయని అక్కడికి వెళ్లినవారు చెబుతుంటారు.

ఇటలీ ప్రభుత్వం(Government of Italy) కూడా ఇక్కడికి వెళ్లే ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వదు. ఇటలీలోని వెనిస్-లిడో(Venice-Lido) నగరాల మధ్య ఉన్న ఈ ద్వీపాన్ని వెనీషియన్ గల్ఫ్(Venetian Gulf) అని పిలుస్తారు. ఈ ద్వీపం దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి భూమిలోని సగభాగం మానవ అవశేషాలతో(human remains) కూడివుందని చెబుతారు. ఇటలీలో ప్లేగు వ్యాప్తి సమయంలో ప్రభుత్వం ఈ ద్వీపానికి ఒక లక్షా 60 వేల మంది బాధితులను తీసుకువచ్చి అంటువ్యాధి(Epidemic)ని నియంత్రించడానికి వారిని సజీవ దహనం చేసినట్లు చరిత్ర చెబుతోంది.

ఇంతేకాకుండా బ్లాక్ ఫీవర్(Black fever) వ్యాధితో మరణించిన వారిని కూడా ఈ ద్వీపంలో ఖననం చేశారు. ఇక్కడ ఒక ఆసుపత్రి కూడా ఉండేదని, తదనంతర కాలంలో దానిని మూసివేశారని చెబుతుంటారు. 1960వ సంవత్సరంలో ఒక ధనవంతుడు ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అయితే అతని కుటుంబం కొన్ని ప్రమాదాలను(Accidents) ఎదుర్కొంది. కొంతకాలానికి అతను కూడా ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. అప్పటి నుండి దీనిని శాపద్వీపంగా పరిగణిస్తున్నారు.

Updated Date - 2023-03-30T08:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising