youngest yoga trainer: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న 7 ఏళ్ల చిచ్చర పిడుగు.. అఖండ భారత ఖ్యాతిని పెంచేలా ఆ చిన్నారి చేస్తున్న పని ఇదే!
ABN, First Publish Date - 2023-03-12T07:28:28+05:30
youngest yoga trainer: ఇప్పుడున్న రోజుల్లో చిన్నారులు(childrens) ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తూ తమ నైపుణ్యం(skill) ప్రదర్శిస్తున్నారు.
youngest yoga trainer: ఇప్పుడున్న రోజుల్లో చిన్నారులు(childrens) ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తూ తమ నైపుణ్యం(skill) ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలోని పలువురు ప్రతిభావంతులైన చిన్నారులు దేశం పేరును నిలబెడుతున్నారు. అలాంటి ఘనమైన పనినే చేసింది ప్రణవి గుప్తా(Pranavi Gupta) అనే చిచ్చర పిడుగు. ప్రణవి వయసు 7 ఏళ్ల 165 రోజులు.
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన యోగా ట్రైనర్(youngest yoga trainer)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు నమోదయ్యేలా ప్రతిభ చాటింది. ఇండియాలో పుట్టిన ప్రణవి.. ప్రస్తుతం భారత్(India) పేరును ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తోంది. ఈ చిన్నారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రణవి తన మూడేళ్ల వయసు నుంచే తన తల్లితో కలిసి యోగా(Yoga) చేయడం ప్రారంభించింది. ప్రణవి 200 గంటల శిక్షణ కార్యక్రమాన్ని(Training program) పూర్తి చేసిన తర్వాత యోగా అలయన్స్ ఆర్గనైజేషన్(Yoga Alliance Organization) యోగా ట్రైనర్‌గా సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రణవి సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సీమా కామత్ వివరిస్తూ ప్రణవి ప్రశాంతమైన మనస్సు గల చిన్నారి అని, ఆమెకు అద్భుతమైన అభ్యాస సామర్థ్యం(Learning ability) ఉందని తెలిపారు. ఇప్పటి వరకు తాను చూసిన పిల్లలందరిలో ప్రణవి క్రమ శిక్షణ గల చిన్నారి అని నిరూపించుకుంది. కేవలం 7 సంవత్సరాల 165 రోజుల వయసు గల ఈ చిన్నారి స్వయంగా యూట్యూబ్ ఛానల్(YouTube channel)ని నడుపుతోందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ప్రణవి యూట్యూబ్ ఛానల్ పేరు లెర్నింగ్ విత్ ప్రణవి(Learning with Pranavi). ప్రస్తుతం ప్రణవి తన కుటుంబంతోపాటు దుబాయ్‌లో ఉంటోంది. అక్కడి నుంచే ప్రపంచంలోని ఔత్సాహికులకు(enthusiasts) యోగా పాఠాలు నేర్పుతోంది. కాగా ప్రణవి కంటే ముందు యువ యోగా ట్రైనర్‌గా రేయాన్ష్ సురాణి(Reyansh Surani) పేరు నమోదైంది. 9 సంవత్సరాల వయసులో రేయాన్ష్ తన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో అతి పిన్న వయస్కుడైన యోగా ట్రైనర్‌గా నమోదు చేసుకున్నాడు.
Updated Date - 2023-03-12T08:00:35+05:30 IST