ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

S Naga Vamsi: సంవత్సరం తర్వాత మళ్లీ ‘సార్’ సినిమాకే..

ABN, First Publish Date - 2023-02-18T12:52:54+05:30

‘భీమ్లా నాయక్, డీజే టిల్లు’ (Bheemla Nayak and DJ Tillu) సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత

Sir Movie Team
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘భీమ్లా నాయక్, డీజే టిల్లు’ (Bheemla Nayak and DJ Tillu) సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు ‘సార్’ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు ‘సార్’ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళ్‌లో ‘వాతి’) (Sir Movie). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మాతలు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలవగా.. ముందు రోజు సాయంత్రం ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. విడుదల తర్వాత సినిమాకి వచ్చిన స్పందన చూసి చిత్రయూనిట్ తమ ఆనందాన్ని తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "చాలా ఆనందంగా ఉంది. నాకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయి. రిలీజ్‌కు ముందు వేసిన ప్రీమియర్లకు మంచి టాక్ రావడంతో.. చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. షో షోకి వసూళ్ళు పెరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్, డీజే టిల్లు సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు ‘సార్’ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. మొదట ఒకట్రెండు ప్రీమియర్‌లు అనుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన‌తో షోలు పెంచుకుంటూ పోయాము. ఒక్క హైదరాబాద్‌లోనే 25 ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం 40 షోలు వేశాము. ధనుష్ గారి ‘రఘువరన్ బి.టెక్’ (Raghuvaran B Tech) తెలుగులో టోటల్ రన్ మీద ఎంత వసూలు చేసిందో.. ఆ మొత్తం ఒక్కరోజులోనే సార్‌కి వస్తాయి. తమిళ్‌లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవరాల్‌గా ధనుష్ కెరీర్‌లో రికార్డు స్థాయి వసూళ్ళు వచ్చే అవకాశముంది’’ అని అన్నారు. (Suryadevara Naga Vamsi about Sir Success)

అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..

సితారలో కమర్షియల్ సినిమాలతో పాటు ‘జెర్సీ’ (Jersey), ‘సార్’ వంటి సినిమాలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి?

సినీ పరిశ్రమ నుంచి కొందరు ఫోన్ చేసి ఇదే విషయం మాట్లాడారు. రాజు గారు ఫోన్ చేసి ఈ సినిమాకి డబ్బులు, పేరు రెండూ వస్తాయి అన్నారు. మళ్ళీ ఇంకోసారి నువ్వు నేషనల్ అవార్డుకి అప్లికేషన్ పెట్టుకునే సినిమా వచ్చింది.. ఇలాంటి మంచి సినిమాలు తీయి అని ఆయన ఫోన్ చేసి చెప్పారు.

మంచి సబ్జెక్ట్‌తో తమిళ్‌లోకి ప్రవేశించారు కదా.. ఇలా మరిన్ని ద్విభాషా చిత్రాలు చేస్తారా?

ఏదైనా మంచి కథ వస్తే, ఇది రెండు భాషల్లో చెప్పాల్సిన కథ అనిపిస్తే ఖచ్చితంగా తీస్తాము. పైగా ఇప్పుడు గేటు కూడా ఓపెన్ అయిపోయింది కదా.

మీరు నిజ జీవితంలో ‘సార్’ సినిమాలోని కాన్సెప్ట్‌ని ఫేస్ చేశారా?మనందరికీ అనుభవమే కదా. నేనొక పెద్ద కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ ర్యాంక్ రాలేదు. డొనేషన్ అడిగితే ఎక్కువ చెప్పారు. మా అమ్మ పొలం అమ్మి నన్ను చదివించింది. అయినా కూడా నేను అనుకున్న కాలేజ్‌లో చదువుకోలేకయాను. ప్రస్తుతం LKGకి కూడా ఫీజులు దారుణంగా ఉన్నాయి. ఫీజులు తగ్గిస్తే చదువు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నాం. ప్రేక్షకులు దీనిని రిసీవ్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.

Updated Date - 2023-02-18T12:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising