ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harshal Juikar: చరిత్ర సృష్టించిన స్టూడెంట్.. ఇంజనీరింగ్ చదవకుండానే గూగుల్‌లో రూ.50 లక్షల జీతంతో ఉద్యోగం

ABN, First Publish Date - 2023-08-04T18:30:28+05:30

గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా కంపెనీల్లో కళ్లుచెదిరే వేతనంతో ఉద్యోగాలు సంపాదించాలంటే.. చాలా కష్టపడాలి. ఐఐటీల్లో చదవాలి. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలి. కానీ.. ఓ స్టూడెంట్ మాత్రం అందుకు భిన్నంగా చరిత్ర సృష్టించాడు.

గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా కంపెనీల్లో కళ్లుచెదిరే వేతనంతో ఉద్యోగాలు సంపాదించాలంటే.. చాలా కష్టపడాలి. ఐఐటీల్లో చదవాలి. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలి. కానీ.. ఓ స్టూడెంట్ మాత్రం అందుకు భిన్నంగా చరిత్ర సృష్టించాడు. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే.. గూగుల్ సంస్థలో రూ.50 లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఆ స్టూడెంట్ పేరు హర్షల్ జుకర్. పుణెలోని ఎంఐటీ-వరల్డ్ పీస్ యూనివర్సిటీకి చెందిన హర్షల్.. బ్లాక్‌చెయిన్ మీద ఆసక్తితో, ఆ విభాగంలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. పట్టుదల, కృషి, నైపుణ్యాలు ఉంటే.. అనుకున్నది తప్పకుండా సాధించగలమని ఈ విద్యార్థి సాధించి చూపించాడు. ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు.

ఈ సందర్భంగా హర్షల్ తన అసాధారణమైన ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు. తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. పరుగులు పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో తన నైపుణ్యాల్ని పెంచుకోవాలన్న విషయాన్ని తాను గ్రహించానని పేర్కొన్నాడు. ఇక అప్పటి నుంచి తాను సిల‌బ‌స్‌కు వెలుప‌ల అవ‌గాహ‌న పెంచుకోవడం కోసం సెల్ఫ్ లెర్నింగ్‌ను అల‌వ‌రుచుకున్నాన‌ని తెలిపాడు. తాను పుణెలో బ్లాక్‌చైన్ టెక్నాల‌జీలో మాస్టర్స్ చేస్తున్న సమయంలో.. కొందరు నిపుణుల నుంచి ఫండమెంటల్స్ నేర్చుకున్నానని, డేటాసెట్స్‌పై ప‌నిచేసే అవకాశమూ లభించిందన్నాడు. అంతేకాదు.. స్టాటిస్టిక‌ల్ అల్గారిథ‌మ్స్‌ను విశ్లేషించడం, ప్రాక్టికల్ సమస్యల్ని పరిష్కరించడం, ప్రెడిక్టివ్ మోడల్స్‌ని సృష్టించడం వంటివి చేశానని గుర్తు చేసుకున్నాడు.


అయితే.. తనకు గూగుల్ నుంచి ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని అనుకోలేదని, తాను పడ్డ కష్టానికి ఎట్టకేలకు ఫలితం లభించిందని హర్షల్ హర్షం వ్యక్తం చేశాడు. అత్యాధునిక ప్రాజెక్ట్‌లకు పేరుగాంచిన టెక్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే అవకాశం రావడం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఈ సంస్థలో పని చేసేందుకు తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, రాబోయే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. తనకు ఇప్పటికే గూగుల్‌లో ఇంటెర్న్‌గా పని చేసే అవకాశం లభించిందని.. ఇది అక్కడి వర్క్ కల్చర్‌ని అర్థం చేసుకోవడానికి, గొప్ప వ్యక్తులతో మమేకం అవ్వడానికి ఎంతో దోహదపడిందని తెలిపాడు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

నిజానికి.. గూగుల్‌లో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా ఉంటుందని, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లైతే తప్పకుండా కొన్ని సవాళ్లను ఎదుర్కుంటారని హర్షల్ చెప్పాడు. కానీ.. సరైన విధానంతో ఈ సవాళ్లను అధిగమించొచ్చని అన్నాడు. గూగుల్ వంటి సంస్థలు ప్యాషన్, అంకితభావం, సమయస్ఫూర్తి, ఏమైనా చేయగల సామర్థ్యం ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాయని.. అందుకే ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుందని పేర్కొన్నాడు. కానీ.. సరైన యాటిట్యూడ్, విధానంతో ఈ ఇంటర్వ్యూని ఛేధించవచ్చని వెల్లడించాడు.

Updated Date - 2023-08-04T18:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising