ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raashii khanna: మాకు ప్రైవసీ కావాలి... అలా చేస్తే దాడితో సమానమే!

ABN, First Publish Date - 2023-02-24T15:26:39+05:30

ముంబైలో తన పక్కింటి నుంచి ఇద్దరు వ్యక్తులు అలియాభట్‌ను ఫొటో తీయడంపై ఆలియా మండిపడ్డ సంగతి తెలిసిందే! ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేసి ‘ఇలా చేయడం సమంజసమేనా’ అని ప్రశ్నించారు. ఆ పోస్ట్‌కు ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైలో తన పక్కింటి నుంచి ఇద్దరు వ్యక్తులు అలియాభట్‌(Alia Bhatt)ను ఫొటో తీయడంపై ఆలియా మండిపడ్డ సంగతి తెలిసిందే! ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేసి ‘ఇలా చేయడం సమంజసమేనా’ అని ప్రశ్నించారు. ఆ పోస్ట్‌కు ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా అలియాను కోరారు. ఇప్పుడు దీనిపై సినీ ప్రముఖులు చాలామంది వారి అభిప్రాయాలను తెలియజేశారు. అలియాకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్‌లో (Tollywood heroine) ఈ వివాదంపై స్పందించారు. తాజాగా హీరోయిన్‌ రాశీ ఖన్నా (raashii khanna) అలియా పోస్ట్‌ గురించి మాట్లాడారు.

‘‘ప్రతి విషయంలోనూ పర్సనల్‌ ప్రైవసీ అనేది ఉంటుంది. (Raashi khanna support to alia) దానిని అందరూ గౌరవించాలి. సెలబ్రిటీ కనిపించినప్పుడు ఫొటోలు తీసుకోవడంలో తప్పులేదు. దానిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటకూడదు. ప్రైవసీకి భంగం కలిగేలా వ్యవహరిస్తే అది దాడితో సమానం అని నా అభిప్రాయం. ఇలా అలియాకు జరిగిందా నాకు జరిగిందా అని నేను చెప్పడం లేదు. ఈ విషయంలో ఎవరైనా ఒకటే. ఇలాంటివి జరగకుండా చట్టాలు రావాల్సిన అవసరం ఉంది’’ అని రాశీఖన్నా అన్నారు.

Updated Date - 2023-02-24T15:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising