ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RRR: ఇది తెలుగు మూవీ.. బాలీవుడ్ చిత్రం కాదు.. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-15T12:15:15+05:30

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే.

Rajamouli
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఆ సినిమా విడుదలై ఇప్పటికీ తొమ్మిది నెలలు అయిపోయింది. అయినా ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ప్రత్రిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) సాధించి దేశ మొత్తాన్ని గర్వించేలా చేసింది. ఆ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా రాజమౌళి కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా (Indian Movie) అంటే విదేశీలంతా బాలీవుడ్ (Bollywood) మూవీనే అనుకుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో అందరూ అలాగే అనుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై ఓ వేడుకలో రాజమౌళి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో ‘‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ కాదు.. ఇది తెలుగు చిత్రం. సౌతిండియా మూవీ’ అని చెప్పుకొచ్చారు. ఈ వైరల్ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘భారతీయ చిత్రాలు అంటే బాలీవుడ్ అనే విధంగా ఎందుకు చూపిస్తారు. ప్రాంతీయ భాష చిత్రాలకు కూడా గుర్తింపు రానివ్వండి’ అని కొందరూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే.. ‘ఆర్ఆర్ఆర్ భారతదేశం నుంచి నామినేట్ అయ్యింది. దక్షిణ భారతదేశం లేదా తెలుగు నుంచి కాదు. ప్రాంతం లేదా భాష పేరుతో పక్షపాతం చూపవద్దు’ అని కొందరు విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2023-01-15T12:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising