ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake bite : వ్యక్తి ప్రాణం పోయే వరకు వదలని పాము.. మొదటిసారి కరిస్తే ప్రాణాలు పోలేదని తెలిసి..

ABN, First Publish Date - 2023-07-01T11:03:41+05:30

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జూన్ 20న జసబ్ ఖాన్ (44)ను ఓ పాము కాటు వేసింది. ఆయన పోఖ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొంది, తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ జూన్ 26న ఆయన మరోసారి పాము కాటుకు గురయ్యారు. ఈసారి కూడా ఆయన చికిత్స పొందినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. జోధ్‌‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జూన్ 20న జసబ్ ఖాన్ (44)ను ఓ పాము కాటు వేసింది. ఆయన పోఖ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొంది, తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ జూన్ 26న ఆయన మరోసారి పాము కాటుకు గురయ్యారు. ఈసారి కూడా ఆయన చికిత్స పొందినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. జోధ్‌‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

జసబ్ ఖాన్ జోధ్‌పూర్ జిల్లాలోని మెహ్రన్‌గఢ్ గ్రామవాసి. ఆయనను కాటు వేసిన పాము రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో తిరిగే జాతికి చెందినదని తెలుస్తోంది. ఈ విషాదకర సంఘటనపై భనియానా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

జసబ్ ఖాన్‌ను జూన్ 20న ఆయన కాలి చీలమండ వద్ద పాము కాటు వేసింది. వెంటనే ఆయనను పోఖ్రాన్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. జూన్ 25న ఆయన ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చారు. కానీ ఆ మర్నాడే ఆయనను ఓ పాము ఆయన కాలిపై కాటు వేసింది. ఈసారి కూడా ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించినప్పటికీ, ఆయన ప్రాణాలతో బయటపడలేకపోయారు. మొదటి పాము కాటు నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల ఆయన రెండో కాటు నుంచి సురక్షితంగా బయటపడలేకపోయారని వైద్యులు తెలిపారు.

జసబ్ ఖాన్‌కు భార్య, తల్లి, నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

ఆయనను రెండోసారి కాటువేసిన పామును చంపేశారు.

ఇవి కూడా చదవండి :

Maharashtra : మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..

Jaishankar and Shashi Tharoor : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై శశి థరూర్ వ్యాఖ్యలు

Updated Date - 2023-07-01T11:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising