Ram Charan: మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

ABN, First Publish Date - 2023-02-09T17:50:13+05:30

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Ram Charan: మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన నుంచి వచ్చే నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలను మించి రాణించాలని రామ్ చరణ్ అనుకుంటున్నారు. అందువల్ల తర్వాత చేయబోయే ప్రాజెక్టులన్ని పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే.. చెర్రీ కొత్త ప్రాజెక్టుకు అంగీకారం తెలిపితారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆయన పుట్టిన రోజు సందర్భంగా రానున్నట్టు సమాచారం అందుతుంది.

రామ్ చరణ్ ఈ మధ్యనే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ 16’ (RC 16) అని వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే.. మరో చిత్రానికి రామ్ చరణ్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. తన 17వ సినిమాను నర్తన్ (Narthan) దర్శకత్వంలో చేయడానికి అంగీకరించినట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న ఈ కాంబినేషన్‌ను ప్రకటించనున్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో నటిస్తున్నారు. వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ 15’ (RC 15) అని వ్యవహరిస్తున్నారు. కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా చేస్తున్నారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. టైటిల్‌ను మార్చి 27న ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

NTR 30: జూనియర్ ఎన్‌టీఆర్‌‌కు విలన్ ఫిక్స్ అయ్యారా..?

Janhvi Kapoor: నెపోకిడ్ ట్యాగ్‌పై స్పందించిన జాన్వీ

Updated Date - 2023-02-09T17:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising