ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ranbir Kapoor Health Issue: రణ్‌బీర్‌ కపూర్‌కు చిన్నప్పటి నుంచీ ఓ వింత సమస్య.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!

ABN, First Publish Date - 2023-08-23T17:53:12+05:30

రణ్‌బీర్‌ కు చిన్నతనం నుండి ఓ వింత సమస్య ఉంది. దీని కారణంగా అతను తినడంలోనూ, మాట్లాడటంలోనూ ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని ఆయన స్నేహితులు, సన్నిహిత వర్గాలు తెలిపాయి

రణ్‌బీర్‌ గురించి ప్రజలకు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ మంచి స్థానాన్ని సృష్టించుకున్నాడు అతను. దివంగత బాలీవుడ్ నటుడు రిషికపూర్ తనయుడిగా, ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ కు భర్తగా కూడా రణ్‌బీర్‌ సుపరిచితుడే. అతనికి చిన్నతనం నుండి ఓ వింత సమస్య ఉంది. దీని కారణంగా అతను తినడంలోనూ, మాట్లాడటంలోనూ ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని ఆయన స్నేహితులు, సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమస్య గురించి తెలిసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన సమస్యను అధిగమించి మరీ హీరోగా తనకంటూ స్థానం సుస్థిరం చేసుకోవడం నిజంగా గొప్ప విషయమని చెబుతున్నారు. అసలింతకూ రణ్‌బీర్‌ కు ఉన్న సమస్య ఏంటి? ఇది ఆయన్ను ఎలా ఇబ్బంది పెడుతుంది? తెలుసుకంటే..

సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. వారు కూడా సాధారణ పౌరుల్లానే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. వారిలోనూ ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది. ఆ లోపాలను వారు ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తుంటారు. రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor) కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. ఇతను నాసల్ డెవియేటెట్ సెప్టెమ్(nasal deviated septum) అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఇది అతనికి చిన్నతనం నుండే ఉండటం గమనార్హం. ముక్కు రంధ్రాలను వేరుచేస్తూ సన్నని గోడ ఉంటుంది. రణ్‌బీర్‌ కపూర్ ముక్కులోపలి ఈ గోడ సాధారణంగా లేదు. దీని కారణంగా ముక్కు ఎముక కాస్త వంగి(nose bone bend) ఉంటుంది. ఇది గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఈ కారణంగా ఇతను తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతుంటాడు. ఇతను భోజనం చేసేటప్పుడు చాలా వేగంగా తింటాడని, మాట్లాడేటప్పుడు కూడా ఇతని మాటతీరు అలాగే ఉంటుందని దానిక్కారణం ఇదేనని అతని స్నేహితులు, సన్నిహితులు చెబుతున్నారు.

Sleeping Mistakes: మీరు కూడా ఈ 5 మిస్టేక్స్ చేస్తున్నారా..? పొరపాటున కూడా ఇలా పడుకోవద్దు..!



నిజానికి ఈ సమస్య రణ్‌బీర్‌ కు చిన్నతనం నుండి ఉన్న కారణాన ఈయన తల్లిదండ్రులు రిషికపూర్(Rishi Kapoor), నీతూ కపూర్ లు ఈయన్ను శస్త్రచికిత్స చేయించుకోమని సలహా ఇచ్చారట. కానీ రణ్‌బీర్‌ అందుకు ససేమీరా ఒప్పుకోలేదు. తనకు సహజంగా ఉన్న ముక్కును అలాగే ఉంచుకుంటానని, దానికి ఎలాంటి సర్జరీ అక్కర్లేదని చెప్పారట. ఏ సమస్య ఎదురైనా తాను ఎదుర్కొంటానని అన్నాడట. 2009లో ఓ సినినా కోసం సినిమా దర్శకుడు సర్జరీ చేయించుకోమన్నా ఈయన తిరస్కరించినట్టు తెలిసింది. రణ్‌బీర్‌ కు మనో బలం ఎక్కవని, ఏదైనా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక దాన్ని మార్చుకోడని, ఆ మాటకే కట్టుబడి ఉంటాడని ఆయన స్నేహితుడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే రణ్‌బీర్‌ కు ఉన్నసమస్య కారణంగా సైనస్ ఇన్ఫెక్షన్లు, గురక, శ్వాస సమస్యలు వంటివి రావడానికి ఆస్కారం ఉంటుందని ఈఎన్టి(ENT) వైద్యులు తెలిపినా ఆయన తన సమస్యను భరించాలనే నిర్ణయించుకున్నాడు.

Singer Weight Loss: ఈ ఒక్క డ్రింక్‌ను మానేశాడట.. దెబ్బకు 25 కేజీల బరువు తగ్గిన ప్రముఖ సింగర్..!


Updated Date - 2023-08-23T17:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising