Rapido Assault Row: రాపిడో డ్రైవర్ వేధిస్తోంటే బైక్‌పై నుంచి దూకేసిన యువతి ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఆమె ఏం చేసిందంటే..!
ABN, First Publish Date - 2023-05-05T16:08:16+05:30
ఏప్రిల్ నెలలో బెంగుళూరుకు చెందిన ఓ యువతి రాత్రి సమయంలో ర్యాపిడో బైక్ బుక్ చేసుకోగా డ్లైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా ఇప్పుడు..
పెద్ద పెద్ద పట్టణాల్లో, నగరాల్లో నైట్ డ్యూటీ చేసే మహిళలు అధికంగా ఉంటారు. అలాగే రాత్రిళ్ళు పనుల కారణంగా బయటకు వెళ్ళే ఆడవారు చాలామంది ఉంటారు. దురదృష్టవశాత్తూ కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏప్రిల్ నెలలో బెంగుళూరుకు చెందిన ఓ యువతి రాత్రి సమయంలో ర్యాపిడో బైక్ బుక్ చేసుకోగా డ్లైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె బైక్ మీద నుండి దూకేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఆ మహిళ తాజాగా వెలిబుచ్చిన కొన్ని విషయాలు మళ్లీ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఆమె ఏం చేసింది? ఇప్పుడు మళ్ళీ ఆమె గురించి చర్చ ఎందుకు? పూర్తీగా తెలుసుకుంటే..
ఏప్రిల్ 21వ తేదీ రాత్రి 11.30(April 21, 11.30 PM) గంటల ప్రాంతంలో బెంగళూరులోని బీఎంఎస్(Bangalore GMS Collage) కాలేజీ సమీపంలో ఓ ఘటన జరిగింది. ఓ యువతి ఇందిరానగర్(Indira Nagar) వైపు వెళ్ళడానికి ర్యాపిడో బైక్‌ను బుక్(Rapido bike booking) చేసింది. అయితే రైడ్ మొదలైనతరువాత డ్రైవర్ ఇందిరానగర్ వైపు కాకుండా దొడ్డబల్లాపూర్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. తన రూట్ మారడంతో ఆ యువతి తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెసేజ్ లు, ఫోన్ కాల్ ద్వారా విషయం తెలిపింది. ఆ డ్రైవర్ మొదటే మద్యం సేవించి ఉన్నాడు, ఆ రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న అతను యువతిని పట్టుకుని ఆమె మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. అతన్నుండి తప్పించుకునే క్రమంలో ఆమె బైక్ మీద నుండి దూకేసింది. ఆమె వేసుకున్న జాకెట్ బాగా మందంగా ఉండటంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదంతా సీసీకెమెరా(CC Camera) లో కూడా రికార్డయ్యింది. ఈ సంఘటన తరువాత ఆ మహిళ బైక్ రైడింగ్ అన్నా, బైక్ బుక్ చేసుకోవాలన్నా చెప్పలేనంత భయపడుతోంది.
Viral News: ఓ యువతి వింత కోరికకు నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా.. మహేశ్ బాబును కూడా వాడేశారు..!
సీసీకెమెరా రికార్డులు కూడా ఉండటంతో పోలీసులు సదరు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతని మీద సెక్షన్ 354, సెక్షన్ 366 కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ సంఘటనను ర్యాపిడో మాత్రం చాలా లైట్ తీసుకున్నట్టు ఆ మహిళ చెబుతోంది. సంఘటన జరిగి ఇన్నిరోజులైనా ఆమెకు ర్యాపిడో నుండి క్షమాపణ కూడా అందలేదు. దానికి బదులుగా సంఘటన గురించి, జరిగిన ఖర్చుల గురించి ర్యాపిడో ఆరా తీసినట్టు ఆమె పేర్కొంది. 'సంఘటన జరిగినప్పుడు బైక్ మీద నుండి దూకేశాను, అప్పుడు చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? మనుషులు చనిపోయిన తరువాతే ఇలాంటి సంఘటనలు పట్టించుకుంటారా?' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'సగటు పౌరుడికి సర్వీస్ అందించే సంస్టలు ఏవైనా బాధ్యతగా ఉండాలి కదా!' అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈవిషయం తెలిసిన నెటిజన్లు ఆమె అంటున్నదాంట్లో తప్పేమీ లేదని ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ర్యాపిడో ఇప్పటికైనా తన తీరు మార్చుకుని, ఆ మహిళకు క్షమాపణ చెప్పాలని అంటున్నారు.
Health: సడన్‌గా బరువు తగ్గిపోవడం.. తరచూ కడుపునొప్పి.. ఇలాంటి లక్షణాలు ఉన్నాయా..? అయితే అది మామూలు సమస్య కాదు..!
Updated Date - 2023-05-05T16:08:16+05:30 IST