Ratan Tata: ఉన్నట్టుండి రతన్ టాటా ఇలాంటి ట్వీట్ చేశారేంటి..? అసలు నాకేం సంబంధం లేదంటూ..!
ABN, First Publish Date - 2023-10-30T16:22:11+05:30
ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో పసికూన అనుకున్న అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి మేటి జట్లను ఓడించి ఔరా అనిపించింది. ఇటీవల చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో (World Cup2023) పసికూన అనుకున్న అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి మేటి జట్లను ఓడించి ఔరా అనిపించింది. ఇటీవల చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ (Afghanistan vs Pakistan) జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో పాక్‌పై అఫ్గాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయం అనంతరం అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. తాలిబన్ల చెరలో మగ్గుతూ కష్టాలు పడుతున్న అఫ్గాన్ పౌరులు కూడా ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ విజయం అనంతరం చెన్నై మైదానంలో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan) భారత జాతీయ పతాకాన్ని (Indian Flag) పట్టుకొని సంబరాలు చేసుకున్నాడని ఓ వార్త పుట్టుకొచ్చింది. దీంతో రషీద్‌పై పాకిస్తాన్ ఐసీసీకి (ICC) ఫిర్యాదు చేసిందని, వెంటనే స్పందించిన ఐసీసీ అతడికి రూ.55 లక్షల జరిమానా విధించిందని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఓ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చాయి. అంతటితో ఆగినా బాగుండేది.. ఐసీసీ జరిమానాకు గురైన రషీద్‌కు ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా (Ratan Tata) అండగా నిలిచారని, రూ.10 కోట్లు బహుమతి ఇస్తానని ప్రకటించారని వార్తలు మొదలయ్యాయి.
Female Constable: హోటల్‌లో భార్య దారుణ హత్య.. నాకేం తెలియదంటూనే పోలీసుల ముందు లొంగిపోయిన భర్త.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
ఈ వార్తలు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ పది కోట్ల వ్యవహారం వైరల్‌గా మారడంతో చివరకు రతన్ టాటా స్పందించాల్సి వచ్చింది. ``నేను ఏ క్రికెటర్ గురించి ఐసీసీకి గానీ లేదా ఏ ఇతర క్రికెట్ ఫ్యాకల్టీకి గానీ సూచనలు చేయలేదు. నాకు క్రికెట్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. నా అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి ప్రకటించే వరకు ఎవరూ అలాంటి వీడియోలను, వాట్సాప్ ఫార్వార్డ్‌లను నమ్మవద్ద``ని సూచించారు.
Updated Date - 2023-10-30T16:22:11+05:30 IST