Viral Video: బాబోయ్.. టాయ్‌లెట్ కమోడ్‌లో పాము.. చేత్తో పట్టుకుని లాగుతోంటే.. ఒక్కసారిగా అదేం చేసిందో చూస్తే..!
ABN, First Publish Date - 2023-08-25T19:28:04+05:30
పర్యటన పూర్తి చేసుకుని తన ఇంటికొచ్చిన అరిజోనా మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. బాత్రూమ్‌లోని కమ్మోడ్‌లో ఓ నల్లటి విషపూరితమైన పాము కనిపించే సరికి ఆమె భయపడిపోయింది. పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దాన్ని బయటకు తోలేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పాము పేరు చెప్పగానే వణికిపోయే వారికి ఏకంగా నల్లటి విషపూరితమైన పాము ఎదురుపడితే? ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అమెరికాలోని అరిజోనా(Arizona) రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
మిషెల్ లెప్రసాన్ అనే మహిళ ఇటీవల టూర్ పూర్తి చేసుకుని తన ఇంటికి వచ్చింది. ఆ తరువాత బాత్రూమ్‌లోపలికి వెళ్లగా కమ్మోడ్‌లో ఆమెకు పెద్ద ర్యాటిల్ స్నేక్(విషపూరితమైన పాము) కనిపించింది. దీంతో, ఆమెకు గుండె ఆగినంత పనైంది(Rattle snake in commode). వెంటనే ఆమె ఒక్క ఉదుటున బాత్రూంలోంచి బయటపడి తలుపులు వేసేసింది. విషయాన్ని ఆమె తన తండ్రికి చెప్పడంతో ఆయన కూడా దాన్ని బయటకు తోలేందుకు కొంత సేపు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఆ తరువాత వారు పాములు పట్టేవాళ్లకు సమాచారం అందించారు.వారు ఆపామును చేతులతో పట్టి కమ్మోడ్‌లోంచి బయటకు లాగారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట పెట్టడంతో వైరల్‌గా(Viral video) మారింది. కమ్మోడ్‌లోంచి పామును బయటకు తీస్తుండగా బుసకొడుతున్న వైనం అనేక మందిని వణికించింది. ఈ పాములు అమెరికాలోని ఎడారుల్లో అధికంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-08-25T19:31:43+05:30 IST