Bank Robbery: 5 నిమిషాల్లోనే 14 లక్షలు చోరీ.. సినిమాలు చూసి బ్యాంకులో దొంగతనానికి పక్కా స్కెచ్..!
ABN, First Publish Date - 2023-08-14T15:52:42+05:30
గుజరాత్‌లోని సూరత్‌లో సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన వెంటనే హెల్మెట్ ధరించిన ఐదుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు. తుపాకీలతో ఉద్యోగులందరినీ బెదిరించి బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు.
గుజరాత్ (Gujarat)లోని సూరత్‌లో సినిమా ఫక్కీలో భారీ దోపిడీ (Robbery) జరిగింది. ఉదయం బ్యాంకు (Bank)తెరిచిన వెంటనే హెల్మెట్ ధరించిన ఐదుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు. తుపాకీలతో ఉద్యోగులందరినీ బెదిరించి బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే క్రైం బ్రాంచ్ అధికారులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు (Crime News).
సూరత్ (Surat) జిల్లాలోని వంజ్ గ్రామంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో శుక్రవారం ఉదయం చోరీ ఘటన జరిగింది. గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు హెల్మెట్లు ధరించి రెండు బైక్‌లపై వచ్చారు. బ్యాంకులోకి ప్రవేశించి తుపాకీలను చూపిస్తూ ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు. అనంతరం రూ.14 లక్షలు దోచుకుని పరారయ్యారు (Bank Robbery). సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Wife: బీర్ బాటిల్‌లో విషం కలిపిన భార్య.. అసలు విషయం తెలియక అంతా తాగేసిన భర్త.. కళ్ల ముందే కట్టుకున్న వాడు చనిపోతున్నా..!
బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సూరత్ నగరం మరియు చుట్టుపక్కల జిల్లాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరం నుంచి బయటకు వెళ్లే రహదారులపై వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నిజానికి సూరత్ జిల్లాలో ఈ తరహా దొంగతనం గతేడాది కూడా జరిగింది. సూరత్‌లోని జిల్లా సహకార బ్యాంకులో గతేడాది ఇదే పద్ధతిలో డబ్బులు దోచుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
Updated Date - 2023-08-14T15:52:42+05:30 IST