ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SS Rajamouli: థియేటర్‌లో సినిమాలను 10, 30, 100 సార్లు చూస్తానంటున్న దర్శకధీరుడు

ABN, First Publish Date - 2023-02-17T20:18:05+05:30

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌లకు దర్శకత్వం వహించిన వ్యక్తి యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌లకు దర్శకత్వం వహించిన వ్యక్తి యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. భారీ స్థాయి వసూళ్లను రాబట్టాయి. జక్కన్న ఇప్పటి వరకు ప్లాఫ్‌ను డెలివరీ చేయలేదు. అందువల్ల రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు హిట్‌గానే భావిస్తారు. అయితే, ఆడియన్స్ పల్స్‌ను విధంగా అంచనా వేస్తారనే అంశంపై రాజమౌళి తాజాగా స్పందించారు.

‘‘నా సినిమాలను చూసి అభిమానులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయం నాకు చాలా ముఖ్యం. అదే సమయంలో కొంత మంది చిత్రం నచ్చిందో లేదో అనే విషయాన్ని ఇతరులతో పంచుకోలేరు. ఒక సమయంలో మూవీని చూపించి అది హిట్టా, ఫట్టా అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. అందువల్ల నా సినిమాలను అంచనా వేయడానికి థియేటర్‌కు వెళ్తాను. ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి రియాక్షన్‌ను చూస్తాను. నేను దర్శకత్వం వహించిన చిత్రాలను ఒక్కోసారి థియేటర్‌లో 10, 30, 40 అవసరమైతే 100 సార్లు చూస్తాను. నేను తెరకెక్కించిన సినిమాలన్ని రామాయణ, మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినవే. ఈ ఇతిహాస కథలను వింటూ నేను పెరిగాను. ఈ పౌరణిక పాత్రల్లోని సంఘర్షణ, వాటి మధ్య బావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి. ఈ రెండు గ్రంథాలు మహా సముద్రాల వంటివి. నాకు అనుమానం తలెత్తిన ప్రతిసారి వాటిని తిరగేస్తాను’’ అని రాజమౌళి తెలిపారు.

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటుతుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ‘నాటు నాటు’ ఆస్కార్ బరిలోను నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేషన్‌ను దక్కించుకుంది.

Updated Date - 2023-02-17T20:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising