ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Loan: గ్యారెంటీ లేకుండా లోన్.. వడ్డీ కూడా చాలా తక్కువండోయ్.. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్ గురించి తెలుసా..?

ABN, First Publish Date - 2023-09-15T15:03:31+05:30

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తే బాగుణ్ను అనుకుంటున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి ముద్ర లోన్ యోజన మీకు మంచి అవకాశం కల్పిస్తోంది.

మీరు లోన్ (Bank Loan) తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎలాంటి గ్యారెంటీ (Guarantee) లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తే బాగుణ్ను అనుకుంటున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి ముద్ర లోన్ యోజన (PM Mudra Loan Yojana) మీకు మంచి అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి గ్యారెంటీ లేకుండా, తక్కువ వడ్డీకు రూ.10 లక్షలు లోన్ ఈ పథకం ద్వారా పొందవచ్చు. ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎంఎఫ్‌ఐలు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రూ.10 లక్షల వరకు లోన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ లోన్లను 3 నుంచి 5 సంవత్సరాల లోపు తీర్చవలసి ఉంటుంది. ఈ పథకం ద్వారా తీసుకున్న డబ్బు కేవలం వ్యాపారానికి (Business) మాత్రమే ఉపయోగించాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించినపుడు లేదా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మాత్రమే ముద్ర లోన్ ఇస్తారు. అలాగే పౌల్ట్రీ, చేపల చెరువులు వంటి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు కూడా లోన్లు ఇస్తారు. ఈ లోన్‌పై స్థిర వడ్డీ లేదు. ఒక్కో బ్యాంకు ఒక్కోరకంగా వడ్డీ విధిస్తాయి. కనీసం 12 శాతం వడ్డీతో ఈ రుణం లభిస్తుంది.

Success Story: వయసు 20 ఏళ్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఏకంగా రూ.1000 కోట్లు.. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే..!

మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఈ లోన్ స్కీమ్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. దరఖాస్తు ఫారమ్‌తో పాటు సంబంధిత పత్రాలన్నింటినీ జత చేయాలి. ఈ పథకం కోసం మీరు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. udyamimitra.in వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ముద్ర లోన్ దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు నింపాలి. సంబంధిత పత్రాలన్నింటినీ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి KYC ప్రూఫ్స్ జత చేయాలి. అలాగే మీ వ్యాపార ప్రణాళికను కూడా క్షుణ్నంగా తెలియజేయాలి.

Updated Date - 2023-09-15T15:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising