ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virupaksha: సాయిధరమ్ మూవీ టీజర్ విడుదల ఎందుకు వాయిదా పడిందంటే..

ABN, First Publish Date - 2023-03-01T21:47:35+05:30

సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), కార్తీక్ దండు (Karthik Dandu) కాంబినేషన్‌లో పాన్ ఇండియా (Pan India) సినిమాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). ఈ చిత్ర టీజర్ మార్చి 1న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్ర టీజర్ చూసిన

Ravuri Pandu and Sai Dharam Tej
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), కార్తీక్ దండు (Karthik Dandu) కాంబినేషన్‌లో పాన్ ఇండియా (Pan India) సినిమాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). ఈ చిత్ర టీజర్ మార్చి 1న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్ర టీజర్ చూసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రయూనిట్‌‌పై ప్రశంసల వర్షం కురిపించిన వీడియో ఒకటి మేకర్స్ తాజాగా విడుదల చేసి.. టీజర్‌పై మరింతగా క్రేజ్ పెంచారు. దీంతో ఎప్పుడెప్పుడు టీజర్ విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తున్న మెగాభిమానులకు (Mega Fans) తీవ్ర నిరాశ ఎదురైంది. ఓ మెగాభిమాని సడెన్‌గా మృతి చెందడంతో.. బుధవారం రావాల్సిన ‘విరూపాక్ష’ టీజర్ విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.

భీమవరం (Bhimavaram) సాయిధరమ్ తేజ్ అభిమాన సంఘానికి అధ్యక్షుడైనటువంటి రావూరి పండు (28) (Ravuri Pandu).. మంగళవారం క్రికెట్ ఆడుతూ.. సడెన్‌గా గుండెపోటుకు గురయ్యారు. గ్రౌండ్‌లోనే కుప్పకూలి.. అక్కడికక్కడే మృతి చెందాడని తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమాని మరణానికి గౌరవం ఇస్తూ.. మేకర్స్ టీజర్ విడుదలను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెగాభిమానులు అంటే.. మెగా హీరోలకు ఎంత ప్రేమో అనేది మరోసారి వెల్లడైందంటూ.. ఫ్యాన్స్ కొందరు ఈ ఘటనపై కామెంట్స్ చేస్తున్నారు. తననెంతో అభిమానించే అభిమాని అలా సడెన్‌గా చనిపోయినందుకు సాయిధరమ్ తేజ్ ఎంతగానో బాధపడ్డాడని.. ఆ ఫ్యామిలీని స్వయంగా కలిసి పరామర్శించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ‘విరూపాక్ష’ టీజర్ విడుదలకు సంబంధించిన నూతన అప్‌డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది.

‘విరూపాక్ష’ చిత్రం సాయిధరమ్ తేజ్‌కు చాలా కీలకమైన చిత్రం. యాక్సిడెంట్ తర్వాత అనేకంటే.. పునర్జన్మ తర్వాత మళ్లీ ఆయన చేసిన చిత్రమిది. ఈ సినిమాపై తేజ్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మామయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులు కూడా అందుకున్న ‘విరూపాక్ష’ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

*********************************

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

* Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

* Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

* Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

* Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

* Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Updated Date - 2023-03-01T21:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!