Japan: ఇసుకలో మొండెం వరకు కూరుకుపోతున్న జపనీయులు.. ఎందుకో తెలుసా..
ABN, First Publish Date - 2023-04-09T14:54:06+05:30
వీళ్లంతా వికటకవి తెనాలి రామలింగడి ఫాలోవర్స్ కాదండోయ్. కానీ ఆయనలా మొండెం వరకూ ఇసుకలోకి కూరుకుపోయారు.
వీళ్లంతా వికటకవి తెనాలి రామలింగడి ఫాలోవర్స్ కాదండోయ్. కానీ ఆయనలా మొండెం వరకూ ఇసుకలోకి కూరుకుపోయారు. జపాన్‌లో ఇదో హాట్ ట్రెండ్. అక్కడి క్యూషూ ద్వీపంలోని ఇబుసుకి నగర తీరంలోని ఇసుక .. అగ్నిపర్వత వేడి నీటి బుగ్గల కారణంగా గోరువెచ్చగా ఉంటుంది. అనేక ఖనిజలవణాల వల్ల ఇసుక రంగు కూడా నల్లగా ఉండడం విశేషం. ఆవిర్లు వచ్చే వెచ్చవెచ్చని ఇసుకలో అలా కూరుకుపోతే ఎంతో హాయిగా ఉంటుంది. మామూలు హాట్ బాత్‌లకంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైనది. మూడు వందల ఏళ్లకు పైగా అక్కడ ఈ స్నానాలను చేస్తున్నారు. ‘సునా ముషి’ గా జపనీయులు పిలిచే ఈ ఇసుక స్నానాలు ఆరోగ్యరీత్యా ఎంతో మేలు చేస్తాయట. ఆస్తమా, వెన్నునొప్పి, పక్షవాతం, మధుమేహం, స్థూలకాయం నుంచి ఉపశమనం పొందవచ్చని స్థానికులు గట్టిగా చెబుతున్నారు.
Updated Date - 2023-04-09T14:58:59+05:30 IST