ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

School Bus: 4 నెలల క్రితమే బడిలో చేర్చారు కానీ.. ఈ 5 ఏళ్ల బాలుడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-11-29T14:53:30+05:30

ఆ కుర్రాడి వయసు 5 సంవత్సరాలు.. నాలుగేళ్ల క్రితమే బడిలో చేరాడు.. ప్రతిరోజూ స్కూల్ బస్సులో స్కూల్‌కు వెళ్లి వస్తుండేవాడు.. అయితే ఊహించని ప్రమాదం ఆ కుర్రాడిని చిదిమేసింది.. ఆ కుర్రాడిన రోజూ పాఠశాలకు తీసుకు వెళ్లే బస్సే అతడి ప్రాణాలు తీసింది..

ఆ కుర్రాడి వయసు 5 సంవత్సరాలు.. నాలుగేళ్ల క్రితమే బడిలో (School) చేరాడు.. ప్రతిరోజూ స్కూల్ బస్సులో (School Bus)స్కూల్‌కు వెళ్లి వస్తుండేవాడు.. అయితే ఊహించని ప్రమాదం ఆ కుర్రాడిని చిదిమేసింది.. ఆ కుర్రాడిని రోజూ పాఠశాలకు తీసుకు వెళ్లే బస్సే అతడి ప్రాణాలు తీసింది.. స్కూల్ బస్సు పై నుంచి వెళ్లిపోవడంతో ఆ కుర్రాడి తల పగిలిపోయింది.. రాజస్థాన్‌ (Rajasthan)లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.. ఆ కుర్రాడి తల్లిదండ్రుల కన్నీళ్లు చూసి ఎంతో మంది బాధపడుతున్నారు (Crime New).

ప్రతాప్‌గఢ్‌కు చెందిన మంగీలాల్ అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడు (5 Years Old Boy) భవేశ్‌ను ఐదు నెలల క్రితం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో జాయిన్ చేశాడు. కూలి పనులు చేసుకునే మంగీలాల్ తన కొడుకును పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. అందుకే కొడుకును ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో వేశాడు. నాలుగు నెలల క్రితమే ఇంటికి కొంత దూరంలో ఉన్న నలంద అకాడమీలో చేరాడు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వచ్చేవాడు. ఎప్పటిలాగానే మంగళవారం కూడా స్కూల్‌కు వెళ్లాడు.

Husband: పాముతో ఓ భర్త పక్కా స్కెచ్.. భార్య, రెండేళ్ల కొడుకు నిద్రపోతున్న గదిలోకి సర్పాన్ని వదిలి..!

తిరిగి ఇంటికి వచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటలకు స్కూల్ దగ్గర బస్సు ఎక్కాడు. అయితే బస్సు దిగుతుండగా భవేశ్ కింద పడిపోయాడు. డ్రైవర్ చూసుకోకుండా బస్సును పోనిచ్చాడు. దీంతో బస్సు ముందు చక్రం భవశ్ తల పై నుంచి వెళ్లిపోయింది. భవేశ్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భవేశ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరుగా విలపించింది.

Updated Date - 2023-11-29T14:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising