మానవాళిని కలవర పెడుతున్న ఆ మూడు వ్యాధులు.. చేతులెత్తేసిన ఆధునిక వైద్యశాస్త్రం.. వివరాలివే!
ABN, First Publish Date - 2023-03-12T08:42:42+05:30
does not have the cure for these diseases: గత కొన్నేళ్లుగా సైన్స్(Science) ఎంతో పురోగతి సాధిస్తూ వస్తోంది. ముఖ్యంగా వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత సరికొత్త విప్లవాన్ని సృష్టించింది.
does not have the cure for these diseases: గత కొన్నేళ్లుగా సైన్స్(Science) ఎంతో పురోగతి సాధిస్తూ వస్తోంది. ముఖ్యంగా వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. కానీ సైన్స్ ఎంత అభివృద్ధి(Development) చెందినా ప్రతి వ్యాధికీ మందు లభ్యం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వ్యాధుల పూర్తి స్థాయి నివారణకు నేటికీ మందులు అందుబాటు(availability)లో లేవు.
మెడికల్ సైన్స్ ఇప్పటికీ ఆ వ్యాధులను పూర్తి స్థాయిలో నివారించలేకపోతోంది(Unavoidable). అయితే ఈ వ్యాధుల పెరుగుదలను కొంతమేరకు నియంత్రించగలుగుతున్నారు. కానీ పూర్తిగా నిర్మూలించలేకపోతున్నారు. ఒకసారి సోకితే జీవితం(జీవితం)లో ఎప్పటికీ పూర్తిగా నయం కాని ఆ వ్యాధులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి స్థానంలో ఆస్తమా(Asthma)
నేటి కాలుష్యపూరిత వాతావరణంలో మీ చుట్టూ ఆస్తమా రోగులు చాలామంది కనిపిస్తారు. ప్రతీ ఇంటిలో ఎవరో ఒకరికి ఆస్తమా వ్యాధి(Asthma) ఉండే పరిస్థితులు దాపురించాయి. బాధితుని శ్వాసకోశ నాళాల(Respiratory tracts)లో ఆటంకాలు, సంకోచం లేదా వాపు ఏర్పడినప్పుడు ఈ వ్యాధి చుట్టుముడుతుంది. ఈ వ్యాధి బారిన పడినవారికి అధికంగా శ్లేష్మం(mucus) విడుదలవుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా బాధితుడు(victim) సాధారణ జీవితం గడపడంలోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతక మూర్ఛలకు కూడా దారితీస్తుంది. వైద్య శాస్త్రం(Medical science) ఆధునికత సంతరించుకున్నప్పటికీ ఆస్తమా చికిత్సలో ఇప్పటి వరకు ఎటువంటి విజయవంతమైన పద్ధతినీ కనుగొనలేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని మందులు, చికిత్సలు ఆస్తమా(Asthma)ను నియంత్రిస్తాయి. కానీ పూర్తిగా నయం చేయలేవు.
రెండవ స్థానంలో అల్జీమర్స్(Alzheimer's)
ఈ వ్యాధి సాధారణంగా వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అల్జీమర్స్‌ని మతిమరుపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి చాలా విషయాలను మరచిపోతుంటాడు. బాధితుని జ్ఞాపకశక్తి(memory) చాలా బలహీనంగా మారుతుంది. 60 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చికిత్స లేదు. రక్తపోటు, మధుమేహం(diabetes), అస్తవ్యస్త జీవనశైలి కారణంగా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి.
మూడో స్థానంలో ఆర్థరైటిస్
గౌట్ వ్యాధి భారతదేశంలో సర్వ సాధారణం. ఇటీవలి కాలంలో ఆర్థరైటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి వయసుతో పాటు మరింత తీవ్రమవుతుంది. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఆధునిక వైద్యశాస్త్రం(Medicine)లోనూ ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. ఆపరేషన్(operation) లేదా మందుల ద్వారా మాత్రమే వ్యాధి మరింతగా పెరగకుండా నిరోధించవచ్చు. వ్యాధిని పూర్తిగా నివారించేందుకు అవకాశం లేదు.
Updated Date - 2023-03-12T08:54:10+05:30 IST