Husband Plan: గూఢచారినంటూ భార్యను నమ్మించడానికి ఓ భర్త మాస్టర్ ప్లాన్.. ఫేక్ ఐడీతో ఎన్ఐఏ ఆఫీసులోకి ఎంట్రీ.. చివరకు..!
ABN, First Publish Date - 2023-08-03T18:18:31+05:30
తాను సీక్రెట్ ఏజెంట్ అని భార్యను నమ్మించబోయిన ఓ వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కిన ఘటన గాంధీనగర్‌లో వెలుగు చూసింది. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు నకిలీదని గుర్తించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ జీవిత భాగస్వామి లేదా ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు చాలా మంది కొండ మీద కోతిని తెచ్చేందుకు కూడా వెనకాడరు. అలాంటి వ్యక్తి తాను సీక్రెట్ ఏజెంట్ అని భార్యను నమ్మించేందుకు ట్రై చేసి చివరకు చిక్కుల్లో పడ్డాడు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తాజాగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లో్కి వెళితే..
గాంధీనగర్ జిల్లా మన్సా తాలుకా అవోలా గ్రామానికి చెందిన గుంజన్ హీరేన్‌భాయ్ కాంతియా స్థానికంగా ఓ వీసా కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తుంటాడు. అతడికి పెళ్లైంది. అయితే, తను జాతీయ దర్యాప్తు సంస్థలో(NIA) సీక్రెట్ ఏజెంట్‌గా(Secret Agent) పనిచేస్తున్నట్టు చెప్పుకునేవాడు. కానీ భార్యకు మాత్రం అతడిపై అపనమ్మకం ఉండేది. దీన్ని పోగొట్టేందుకు అతడు ఓ భారీ ప్లాన్ వేసి మంగళవారం దాన్ని అమలు చేశాడు(Man pretends to be secret agent to impress her).
ఆ రోజు భార్యతో పాటు కారులో జాతీయ దర్యా్ప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. భార్యను పార్కింగ్ స్థలంలోనే ఉండమని చెప్పి కార్యాలయం లోపలికి వెళ్లాడు. అంతకుముందుగానే సిద్ధం చేసిపెట్టుకున్న ఓ నకిలీ గుర్తింపు కార్డును ఎంట్రన్స్ వద్ద ఉన్న అధికారికి చూపించాడు. దాన్ని చూడగానే ఆ అధికారి జరుగుతున్న మోసాన్ని గుర్తించి కాంతియాను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు అప్పగించాడు. భార్యను ఎలాగైన నమ్మించాలనుకున్న కాంతియా ప్రళాలిక ఇలా బెడిసికొట్టి చివరకు పోలీసులకు చిక్కాడు.
కాంతియా వద్ద ఇతరు ప్రభుత్వ విభాగాల గుర్తింపు కార్డులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల సంతకాలను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అతడు నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకున్నాడని వెల్లడించారు. వీటి సాయంతో అతడు గతంలో తన కోసం అనేక పనులు చక్కబెట్టుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించి కాంతియాపై కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-08-03T18:18:35+05:30 IST