ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Self Injury Awareness Day: మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా చేశారా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే..!

ABN, First Publish Date - 2023-03-01T11:08:58+05:30

మాసికంగా కుంగిపోయిన వారు వెంటనే ఆలోచించే విషయం తమని తాము గాయపరుచుకోవడం

Awareness Day
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సెల్ఫ్ ఇంజరీ అవేర్నెస్ డే: మారుతున్న కాలంతో ప్రతి వ్యక్తి ఒత్తిడికి గురవుతూనే ఉన్నాడు. మోయలేని భారాన్ని బ్యాగుల నిండా నింపుకుని భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరిలోనూ తప్పని పరిస్థితిగా మారింది. అయితే ఈ ఒత్తిడిని తట్టుకోలేనివారు, మాసికంగా కుంగిపోయిన వారు వెంటనే ఆలోచించే విషయం తమని తాము గాయపరుచుకోవడం, లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, డిప్రెషన్ వంటి చర్యలతో విపరీతాలకు పాల్పడటం ఇప్పటి రోజుల్లో సాధారణ సమస్యగా తయారయింది. అయితే ఈ పరిస్థితిలో మార్పురావాలని స్వీయ గాయం అవగాహన కల్పించడం కోసం Self Injury Awareness Day జరుపుకుంటున్నాం.

తమని తాము గాయపరుచుకునే వ్యక్తులకు అవగాహన కల్పించే విధంగా, ప్రతి సంవత్సరం మార్చి 1ని అంతర్జాతీయ దినోత్సవం స్వీయ-గాయం అవగాహన దినంగా పాటిస్తారు. గ్లోబల్ అవేర్‌నెస్ ఈవెంట్ స్వీయ-హాని చేసుకునేలా ప్రేరేపించబడిన వ్యక్తులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గాయపరుచుకోవడం, కాల్చడం, గోకడం, కొరికడం, గాయం వంటి హానికరమైన ప్రవర్తనల గురించి అవగాహనను కల్పిస్తూ, అటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండే విధంగా తీసుకోవలసిన చర్యలను, అవగాహనను కల్పిస్తుంది. అంతేకాకుండా, స్వీయ-హాని కలిగించుకునే వ్యక్తులకు మద్దతుగా కుటుంబ సభ్యులు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఈ రోజున అవగాహన కల్పించే విధంగా ప్రోత్సహిస్తుంది.

మానసికంగా కుంగుబాటు..

ఇది ఒక రకంగానే ఉండాలని ఏం లేదు. రకరకాల పరిస్థితులు, ప్రభావాలతో మానసిక కుంగుబాటుకు గురవుతున్నాడు మనిషి. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ప్రేమ విఫలమైందనో, లేక ఆర్థిక ఇబ్బందులు, దుఃఖం, కోపం, మోసం, ఒత్తిడి, పరిస్థితుల నుంచి దూరంగా పారిపోవడం, చేతకాని తనం ఇలా రకరకాల కారణాలతో మనిషి స్వీయ గాయం వైపు వెళుతున్నాడు. దీనిని అరికట్టాలంటే మానసిక నియంత్రణ అవసరం. మానసిక ఆరోగ్యం, పరిస్థితుల గురించి అవగాహన పెంపొందించడమే కాకుండా, నలుగురితో కలిసి మనసులోని భావాలను పంచుకోవడం, అపోహలు, పక్షపాతాలను తొలగించడం కూడా SIAD ఉద్దేశ్యం.

ఒక వ్యక్తిలో స్వీయ-గాయం చేసుకోవాలనే ధోరణిని గుర్తించడానికి సంకేతాలు:

1. తగ్గిన ఆత్మగౌరవం, విశ్వాసం

2. పదునైన ఆయుధాలను ఇష్టపడటం, వింత ప్రవర్తన

3. శరీరం మీద మచ్చలు, కోతలు, కాలిన గాయాలు

4. ఇతర వ్యక్తులతో సంబంధాలలో ఇబ్బందులు

5. తీవ్రమైన భావోద్వేగాలు, అసమర్థత

6. విచిత్రమైన ప్రవర్తనా, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం

7. ఒక నిర్దిష్ట ప్రదేశంలో అధికంగా రుద్దడం లేదా గోకడం

8. నిస్సహాయత, విలువలేని భావాలను వ్యక్తం చేయడం

స్వీయ గాయం చేసుకునే వారిలోని లక్షణాలను తొలగించాలంటే..

అటువంటి ప్రవర్తన నుంచి బయటపడాలనుకునేవారు ఎదుటివారితో మనసులోని భావాలను పంచుకోవడం మంచిది. ఇది కాస్త ఊరటనిస్తుంది. ధైర్యాన్ని నింపుతుంది. దేవుడిచ్చిన కోమలమైన శరీరాన్ని గాయపరుచుకుని తృప్తి పొందటం అనేది అటవిక చర్యగా భావించే విధంగా అవగాహనను కల్పిస్తుంది. ఒత్తిడిని జయించే విధంగా సలహాలను, సూచనలను పొందే వీలుంటుంది. అలాగే నలుగురితో కలవడం అనేది మన సమస్యను చిన్నది చేస్తుంది. మరీ పరిస్థితి చేయి దాటిపోయిందనిపిస్తే మాత్రం మానసిక నిపుణుల సలహాలను పాటించడం, ‌ఉచిత థెరఫీ సెషన్‌లను తీసుకోవడం కూడా మీలోని సమస్యను తగ్గించేందుకు చక్కని మార్గం. ఇవన్నీ మానసిక స్థితి మీద అవగాహన పెంచడానికి అదనపు ప్రయత్నం చేస్తాయి.

Updated Date - 2023-03-01T11:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!