ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విహార యాత్రలో విషాదం: కాలు జారి లోయలో పడి...

ABN, First Publish Date - 2023-04-08T11:55:15+05:30

హిల్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన ప్రేమజంట(couple) ఘోర ప్రమాదం బారినపడింది. కొండపై నడుచుకుంటూ వెళుతుండగా ప్రియుడి కాలు జారి, 650 అడుగుల లోయలో పడిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హిల్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన ప్రేమజంట(couple) ఘోర ప్రమాదం బారినపడింది. కొండపై నడుచుకుంటూ వెళుతుండగా ప్రియుడి కాలు జారి, 650 అడుగుల లోయలో పడిపోయాడు. ప్రియురాలి ముందే ప్రియుడు(boyfriend) చనిపోయాడు. ఈ ఘటనకు ముందు ఈ జంట కలిసి ఫోటోలు తీసుకుంది. తన ప్రియుడు మరణించిన తర్వాత ఆ యువతి ఈ ఫొటోను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాసింది.. 'ఇదే మా చివరి ఫొటో’. ‘ది మిర్రర్’ కథనం ప్రకారం 30 ఏళ్ల ఆండ్రియా మైజెటో తన స్నేహితురాలు సారా బ్రగాంటెతో కలిసి ఇటలీ(Italy)లోని రోట్జోలోని పర్వత ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లాడు. ఇక్కడ సరదాగా గడిపి ఫొటోలు తీసుకున్నారు. కొండపై నిలబడి ఫోటో తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రియుడు లోయలోకి జారిపడి మృతి చెందాడు. కొండపై నడుస్తున్నప్పుడు మైజెటో కాలు జారి, లోయలో పడిపోయాడు. రక్షించేందుకు హెలికాప్టర్‌(Helicopter) సాయం తీసుకున్నా, అప్పటికే మృతి చెందాడు. మైజెటో ఫోన్ కిందపడిందని, దానిని తీయడానికి ప్రయత్నిస్తుండగా 650 అడుగుల లోయలో పడిపోయాడని పోలీసులు(police) తెలిపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా సారా, మైజెటో తరచూ తమ రొమాంటిక్ చిత్రాలను సోషల్ మీడియా(Social media)లో షేర్ చేసేవారు. మైజెటో మృతిపై ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-08T11:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising