ప్రపంచంలోని అత్యుత్తమ కూరలలో భారత్‌కు ఐదో స్థానం... అంతలా నోరూరించే ఆ వంటకం ఏమిటంటే...
ABN, First Publish Date - 2023-03-28T11:52:36+05:30
ఇటీవల ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్(Taste Atlas) ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ రేటింగ్(Excellent rating) ఉన్న కూరల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుండి ఒక వంటకం(dish) టాప్ 5లో చోటు దక్కించుకుంది.

ఈ జాబితాలో షాహీ పనీర్ పేరు ఐదవ స్థానం(Fifth place)లో నిలిచింది. ఇది శాఖాహారులలో అత్యంత ఇష్టమైన వంటకం. షాహీ పనీర్ పేరులానే అది ఎంతో రాయల్... డ్రై ఫ్రూట్స్(Dry fruits) కూడా ఇందులో వాడతారు. ఈ వంటకం భారతదేశంలో మాత్రమే తయారు చేస్తారు.
ఈ జాబితాలో కీమా 10వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఫనాంగ్ కర్రీ(Fanang curry) ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. థాయ్‌లాండ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థాయ్ ఆహార ప్రియులు(Food lovers) దీనిని ఇష్టపడతారు. దీని తర్వాత రెండవ నంబర్‌లో జపాన్‌కు చెందిన కరే అనే కూర ఉంది. మూడవ స్థానం(Third place)లో చైనా సిగ్నేచర్ డిష్ సిచువాన్ హాట్ పాట్ ఉంది. వియత్నామీస్ వంటకం నాల్గవ స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన షాహీ పనీర్(Shahi Paneer) ఈ జాబితాలో 4.7 రేటింగ్‌తో ఐదవ స్థానంలో ఉంది.
Updated Date - 2023-03-28T11:52:36+05:30 IST