ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తతో 1000 కోట్ల సంస్థను అభివృద్ధి చేసి.. ఎగతాళి చేసిన భర్తనే తన క్రింద ఉద్యోగిగా నియమించుకుంది..

ABN, First Publish Date - 2023-01-12T17:24:11+05:30

నాతో కలసి బిజినెస్ పార్ట్నర్‌గా ఉంటావా అని భర్తను అడిగిందామె. సంవత్సరానికి 80లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్న భర్త 'నన్ను నువ్వు భరించలేవు' అని సున్నితంగానే చెప్పినా ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అనే సామెత అందరికీ తెలిసిందే.. ఈమె విషయంలో అదే జరిగింది. నాతో కలసి బిజినెస్ పార్ట్నర్‌గా ఉంటావా అని భర్తను అడిగిందామె. సంవత్సరానికి 80లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్న భర్త 'నన్ను నువ్వు భరించలేవు' అని సున్నితంగానే చెప్పినా ఇంత శాలరీ తీసుకుంటున్న వ్యక్తికి.. నీ దగ్గర ఉద్యోగం ఏమిస్తావనే మాట పరోక్షంగానే చెప్పినట్టయ్యింది. అయితే ఆమె దాన్ని సులువుగా వదిలెయ్యలేదు. ఆ మాట చెప్పిన తన భర్తకు ఆరు నెలల్లో రెట్టింపు ప్యాకేజీ ఇచ్చి మరీ తన దగ్గర ఉద్యోగిగా నియమించుకుంది. వ్యాపార సామ్రాజ్యంలో విజేతగా నిలిచిన ఈమె గురించి తెలుసుకుంటే..

ఢిల్లీకి చెందిన పూనమ్ గుప్తా 2002 సంవత్సరంలో పునీత్ గుప్తా అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఆమె భర్త స్కాట్లాండ్‌లో మెడికల్ ఫీల్డ్‌లో సంవత్సరానికి 80 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసేవాడు. పూనమ్ ఎంబియేతో పాటూ లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. రెండు డిగ్రీలు పూర్తి చేస్తే ఉద్యోగం సులువుగా దొరుకుతుందని ఎవరో చెప్పిన మాటలు విని.. ఆమె అలాగే చేసినా ఆమెకు ఉద్యోగం దొరకలేదు. చివరికి ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి 'ఇవన్నీ ఎందుకు హాయిగా సొంతంగా బిజినెస్ చేసుకుంటే పోలా..' అనుకుంది.

ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్న ఆమెకు యూరప్, అమెరికా దేశాలలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్తగా మారుతున్న కాగితాలే వ్యాపారానికి ఒక మార్గం అనిపించింది. అక్కడి కంపెనీలు అధిక నాణ్యత గల కాగితాన్ని మార్కెట్లో విడుదల చేస్తాయి. దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు వారికి లేదు. అందుకే ఆ చెత్త కాగితాలను వదిలించుకోవడానికి వారు డబ్బు కూడా వెచ్చించేవారు. ఆ కాగితాన్ని రీసైకిల్ చేస్తే అది భారతీయులు ఉపయోగించుకోదగినదిగానే అనిపించింది పూనమ్‌కు. ఆమె వెంటనే విదేశాలలో ఉన్న కంపెనీలతో మాట్లాడి ఆ చెత్తకాగితాలను తనకు ఇవ్వమని కోరింది. దానికోసం డబ్బు కూడా ఇస్తానని వాళ్ళకు చెప్పింది. తాము డబ్బు పెట్టి మరీ వదిలించుకోవాలని అనుకున్న చెత్తను తీసుకుని.. డబ్బు కూడా ఇస్తామనే ప్రతిపాదన రావడంతో ఆ కంపెనీలు పూనమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అలా పూనమ్ వ్యాపారం మొదలైంది.

పూనమ్ పాత ఢిల్లీలో పెరగడం వల్ల అక్కడ పేపర్ బిజినెస్ చేసేవారు చాలా ఉండటం వల్ల పెద్ద సమస్యలు ఏమీ ఎదురుకాలేదు. ఈ వ్యాపారం ఎలాంటి సమస్యా లేకుండా విజయవంతంగా సాగుతుండటంతో పూనమ్‌కు నమ్మకమైన భాగస్వామి ఉంటే బాగుండునని అనిపించింది. అయితే ఎవరో ఎందుకు నా భర్తనే అడుగుదాం అని అతనికి తన ప్రపోజల్ వివరించింది. ఆ సమయంలో అతను స్కాట్లాండ్‌లో రూ.80 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడు. 'చూడు పూనమ్ నువ్వు నన్ను భరించలేవు' అని అతను తన సంపాదన గురించి పరోక్షంగానే ఆమెకు చెప్పాడు. అయితే పూనమ్ అతన్ని వదల్లేదు. 'మీరు మీ డ్యూటీ అయ్యాక పార్ట్ టైమ్‌గా ఇందులో చేయండి ఆ తరువాత నచ్చితే కంటిన్యూ చేయవచ్చు' అని చెప్పింది. భార్య మాట కాదనలేక ఆమె చెప్పినట్టే చేశాడు. అయితే ఆరు నెలల తరువాత పూనమ్ అతనికి సంవత్సరానికి 1.50 కోట్ల ప్యాకేజీతో తన దగ్గర పర్మినెంట్‌ ఉద్యోగస్తుడిగా నియమించుకుంది.

ఈమె వ్యాపారంలో దినదినాభివృద్ది సాధిస్తుంటే విదేశాల్లోని బ్యాంకులు ఈమెకు లోన్లు ఇచ్చాయి. ఫలితంగా ఈమె తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇటీవల ప్రవాస భారతీయుల దినోత్సవంలో భారతీయ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూనమ్ విజయాన్ని తెలుసుకుని చాలా ఇంప్రెస్ అయ్యింది. భారతీయులు దేన్నీ అంత సులువుగా వదులుకోరు. ఒక వస్తువు పాడైనా, పాత బడినా దాన్ని మరొక విధంగా ఎలా ఉపయోగించాలా అని చూస్తారు. ఆ స్వభావమే నన్ను ఈ వ్యాపారం వైపు నడిపించింది అని అంటున్నారు పూనమ్. ఈమె ప్రతి భారతీయ మహిళకు ఆదర్శం అనడంలో అతియోక్తి లేదు.

Updated Date - 2023-01-12T17:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising