ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండనన్న స్నేహితురాలిపై కోర్టులో కేసు.. రూ.18 కోట్ల పరిహారానికి డిమాండ్..

ABN, First Publish Date - 2023-02-05T20:03:33+05:30

సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితురాలిపై కోర్టుకెక్కాడు. ఆమె ప్రవర్తనతో తనకు మానసిక వేదన మిగిలిందని, పరిహారంగా ఆమె తనకు రూ.18 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్‌కు(Singapore) చెందిన ఓ వ్యక్తి తన స్నేహితురాలిపై కోర్టుకెక్కాడు. ఆమె ప్రవర్తనతో తనకు మానసిక వేదన మిగిలిందని, పరిహారంగా ఆమె తనకు రూ.18 కోట్లు ఇవ్వాలని(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2016లో తొలిసారిగా క్వాషిగన్‌కు(Kwashigan) ఆమె పరిచయమైంది. నాలుగేళ్ల పాటూ అంతాసజావుగా సాగినా 2020 నుంచి వారి బంధం విషయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఆమెమో అతడిని స్నేహితుడిగానే భావించింది. అతడేమో ఆమె తన ‘క్లోజ్ ఫ్రెండ్‌గా’ అని అనుకున్నాడు. అయితే.. తమ మధ్య అటువంటి రొమాంటిక్ బంధం ఏదీ లేదని ఆమె తేల్చి చెప్పింది. పదేపదే తనతో మాట్లాడొద్దని సూచించింది. దీంతో.. ఆమెపై కేసు వేస్తానని క్వాషిగన్ బెదిరించాడు. తనకు మానసిక వేదన కలిగించినందుకు కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించాడు. దీంతో.. ఆమె అతడితో పాటూ 18 మార్లు కౌన్సెలింగ్‌కు హాజరైంది. కౌన్సెలింగ్‌తోనైనా అతడు మారతాడనే ఆశతో ఆమె ఇందుకు ఒప్పుకుంది.

కానీ.. క్వాషిగన్‌లో మార్పు లేకపోవడంతో ఆమె అతడితో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకుంది. ఆమె చర్యతో హర్ట్ అయిపోయిన అతడు చివరకు కోర్టులో కేసు వేశాడు. తమ బంధాన్ని బాగుచేసుకునేందుకు తమ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించిందంటూ ఆరోపించాడు. కానీ.. కోర్టు అతడి కేసును కొట్టేసింది. అతడి వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే అతడు మరోమారు కోర్టును ఆశ్రయించాడు. మహిళ వ్యాఖ్యల వల్ల తనకు మానసిక వేదన మిగిలిందని, తన పరువు మంట కలిసిందని ఆరోపించాడు. ఆమె తనతో నిర్లక్ష్యపూరితంగా, అవమానకరంగా వ్యవహరించిందన్నాడు. ఈ వేదన నుంచి కోలుకునేందుకు వైద్యసాయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలో తాను ఆదాయం, పెట్టుబడి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో వచ్చేవారం నుంచి కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

Updated Date - 2023-02-05T20:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising