ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Smartphones: పాత ఫోన్లను అమ్మేస్తున్నా.. ఎక్ఛేంజ్ చేస్తున్నారా..? ఈ 5 విషయాలను అస్సలు మర్చిపోవద్దు..!

ABN, First Publish Date - 2023-12-07T12:48:32+05:30

కొత్త ఫోన్ ఖర్చు తగ్గించుకోవడానికి తమదగ్గరున్న ఫోన్ ను ఎక్ఛేంజ్ కు ఇవ్వడం లేదా ఎవరికైనా అమ్మడం చేస్తుంటారు. అలా చేసే ముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి.

ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఎక్కువ భాగం యువత కొత్త స్మార్ట్ ఫోన్లను ఉయోగించడానకి ఆసక్తి చూపిస్తుంది. దీనికి కారణం టెక్నాలజీ సంస్థలు ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లను అప్టేట్ చేస్తూ కొత్త ఫీచర్లతో లాంచ్ చేయడమే. ఈ కారణంగానే అప్పటికే తమ దగ్గరున్న ఫోన్ బాగా పనిచేస్తున్నా సరే.. మళ్లీ కొత్త ఫోన్ తీసుకోవడానికి తహతహలాడతారు. కొత్త ఫోన్ ఖర్చు తగ్గించుకోవడానికి తమదగ్గరున్న ఫోన్ ను ఎక్ఛేంజ్ కు ఇవ్వడం లేదా ఎవరికైనా అమ్మడం చేస్తుంటారు. అయితే పాత ఫోన్ ను అమ్ముతున్నా, ఎక్చేంజ్ చేసుకుంటున్నా ఈ కింది 5 విషయాలు అస్సలు మరచిపోకూడాదు. లేకపోతే చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అన్ లిమిటెడ్ కాల్ సర్వీసులు వచ్చాక ఎవరితో అయినా అసలెంత సేపు ఫోన్ మాట్లాడుతారో కొందరికి తెలియదు. వీటిలో చాలా పర్సనల్ విషయాలు ఉండొచ్చు. ఎవరికైనా ఫోన్ అమ్మేస్తుంటే ఫోన్ లో ఉన్న మొత్తం కాల్ రికార్డ్, మెసేజ్ లిస్ట్ ను క్లియర్ చేయాలి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ సహాయంతో వీటిని బ్యాకప్ తెచ్చే సౌకర్యం ఉంటుంది.

ఇది కూాడా చదవండి: మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టకూడని 7 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ..!


ఎక్కువశాతం మంది ఆన్లైన్ లోనే ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రతి ఫోన్ లో మనీ ట్రాన్స్ఫర్ యాప్ లు ఉంటాయి. వీటిని తొలగించడం తప్పనిసరి. సిమ్ కార్డ్ తీసేసిన తరువాత వీటి వల్ల ఎలాంటి హాని జరగనప్పటికీ ఏదైనా డేటా సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ చేతికొచ్చాక ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. సెల్ఫీలు, షార్ట్స్, వీడియోస్ ఇలా చాలా ఉంటాయి. వీటిలో వ్యక్తిగత ఫోటోలు కూడా ఉంటాయి. ఫోన్ అమ్మడం లేదా ఎక్ఛేంజ్ కు ఇచ్చేముందు గూగల్ ఫోటోస్, గూగుల్ డిస్క్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, డ్రాప్ బ్యాక్స్ లేదా ఇతర క్లౌడ్ సర్వీస్ ద్వారా బ్యాకప్ చేసినట్టు నిర్థారించుకోవాలి. లేకపోతే అపురూపమైన జ్ఞాపకాలు పోతాయి. సింపుల్ గా పెన్ డ్రైవ్ లో వీటిని జాగ్రత్త చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ ను ఫ్యాక్టరీ రిసెట్ చేయడానికి ముందు మొబైల్ లో అన్ని అకౌంట్స్ తొలగించామా లేదా అనేది ధృవీకరించుకోవాలి.

ఎక్కువమంది వినియోగించే యాప్ వాట్సాప్. చాటింగ్ నుండి కాలింగ్ వరకు ప్రతి ఒక్కటి ఇందులోనే జరిగిపోతున్నాయి. వాట్సప్ బ్యాకప్ ఉంటుంది. దీన్ని బ్యాకప్ పెట్టకపోతే కొత్త ఫోన్ లో పాత చాటింగ్ లు,ఫోటోలు రావు. కాబట్టి వాట్సాప్ బ్యాకప్ మరచిపోకండి.

Cauliflower vs Cabbage: కాలీఫ్లవర్ మంచిదా..? క్యాబేజీ తినాలా..? ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..!


Updated Date - 2023-12-07T12:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising