ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Cave: బాబోయ్.. ఇదేం వింత.. అచ్చం పాము ఆకారంలో గుహ.. అచ్చం చర్మాన్ని పోలి ఉండేలా..!

ABN, First Publish Date - 2023-08-21T20:35:55+05:30

ఈ గుహ అచ్చం పాము ఆకారంలో ఉంది. కేవలం ఆకారం మాత్రమే కాదు దీని గోడలపైన అచ్చం పాము చర్మాన్ని పోలినట్టుగా పొలుసులు పొలుసులుగా ఉంది. ఈ గుహ గురించి తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు దీని వెనుక రహస్యాన్ని వెల్లడిస్తున్నారు.

ప్రకృతి చాలా వింతైనది. చెట్టు, చేమ, పుట్ట, రాయి, నీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా రూపాంతరం చెందుతాయో మనిషికి అంతుప్టటని రహస్యం. ప్రకృతిలోని కొన్ని విషయాలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనిషి ఊహకందని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఓ గుహ ఇప్పుడు అలాంటి వింత అనుభూతినే ఇస్తోంది. ఈ గుహ అచ్చం పాము ఆకారంలో ఉంది. కేవలం ఆకారం మాత్రమే కాదు దీని గోడలపైన అచ్చం పాము చర్మాన్ని పోలినట్టుగా పొలుసులు పొలుసులుగా ఉంది. ఈ గుహ గురించి తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు దీని వెనుక రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. అసలింతకీ ఈ గుహ ఇలా ఉండటానికి కారణం ఏంటి? ఇది ఎక్కడుంది? పూర్తీగా తెలుసుకుంటే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో గుహలో పెద్ద పాము చెట్టు ఆకారంలో ఇమిడిపోయి ఉంటుంది. చిరంజీవి శివుడి ఆత్మలింగాన్ని తాకినప్పుడే ఈ పాము తన నిజరూపంలోకి వస్తుంది. ఇప్పుడీ విషయం అంతా ఎందుకంటే సదరు గుహ ఆకారంలో ఉన్న పాము కూడ అలానే చలనం లేకుండా ఉండిపోయిందని, ఏదో ఒకరోజు ఈ పాము చలనంలోకి వస్తుందని అంటున్నారు. ఈ పాము గుహను నాగా గుహ(Naga cave) అని అంటున్నారు. ఇది థాయిలాండ్(Thailand) దేశంలో ఉంది. ఈ గుహ అచ్చం పామును పోలి ఉంటుంది(cave like a giant snake). ఈ దీని వెలుపలి భాగం పాము చర్మం ఉన్నట్టు పొలుసుల రూపంలో ఉంటుంది. ఇది సహజసిద్దంగా ఏర్పడిన గుహ అని కొందరు అంటే దీని వెనుక కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయని మరికొందరు అంటారు. నాగజాతికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్న ఒక యువరాజు శాపవశాత్తు ఇలా రాతి పాముగా మారిపోయాడని ఓ పురాణ కథనం. ఈ గుహ కారణంగా తమ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. అందుకే దీన్ని పవిత్రంగా భావిస్తున్నారు. భారీ పాము చుట్టచుట్టుకున్నట్టుగా ఏర్పడిన ఈ గుహకు పాము తలభాగం కూడా చాలా స్పష్టంగా ఉండటంతో దీని గురించి ఒక స్పష్టత రావడం లేదు. ఈ గుహలో చాలా పాములు నివాసం ఏర్పరచుకున్నాయట. నిరంతరం థ్రిల్లింగ్ కోసం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అన్వేషణలు చేసేవారు మాత్రమే ఇందులోకి దైర్యంగా వెళ్లి తిరిగి రాగలుగుతారని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది ఖచ్చితంగా భారీ పాము శిలాజం అని చెబుతున్నారు.

Smartphone Charging: స్మార్ట్‌ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే చాలు.. యమా స్పీడ్‌గా ఛార్జింగ్..!



ఈ గుహకు సంబంధించిన ఫోటోలను The Unexplained అనే ట్విట్టర్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీని గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 'ఇది రాయిగా మారిపోయిన పాము, కాదని ఎవరూ చెప్పలేరు కూడా. ఎందుకంటే స్పష్టంగా ఇది పాము శిలాజం అని అర్థమవుతోంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ పాము తిరిగి సజీవంగా పైకి లేవడానికి ఎదురుచూస్తున్నట్టు ఉంది' అని ఇంకొకరు కామెంట్ చేసారు. మరికొందరు ఈ నాగా గుహ వెనుక కథలను ప్రస్తావిస్తున్నారు.

Viral Video: అగ్రరాజ్యంలో భరత నాట్యం.. అమెరికన్లను అవాక్కయ్యేలా చేసిన భారతీయ మహిళ..!


Updated Date - 2023-08-21T20:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising