Heeramandi: వేశ్యలే అక్కడ రాణులు

ABN, First Publish Date - 2023-02-18T17:21:21+05:30

బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)ఒకరు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (Hum Dil De Chuke Sanam), దేవదాస్ (Devdas), ‘బాజీరావ్ మస్తానీ’ (Bajirao Mastani) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను ప్రేక్షకులను అందించారు.

Heeramandi: వేశ్యలే అక్కడ రాణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)ఒకరు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (Hum Dil De Chuke Sanam), దేవదాస్ (Devdas), ‘బాజీరావ్ మస్తానీ’ (Bajirao Mastani) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను ప్రేక్షకులను అందించారు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’ (Heeramandi). నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. వేశ్యల నేపథ్యంలో ఈ షో కొనసాగనున్నట్టు తెలుస్తోంది.

Heeramandi.jpg

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ‘హీరామండి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో పాటు టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘సంజయ్ లీలా భన్సాలీ క్రియేట్ చేసిన కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఎదరు చూస్తున్నాం. అందమైన ‘హీరామండి’ గ్లింఫ్స్‌ను చూడండి. అతి త్వరలోనే ఈ షో మీ ముందుకు వస్తుంది’’ అని మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. వేశ్యలే అక్కడ రాణులు అని పోస్టర్‌పై రాశారు. వెబ్‌సిరీస్ గ్రాండ్‌గా రూపొందుతున్నట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు ఈ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్‌లో అందరు సంప్రదాయ దుస్తులను ధరించి కనిపించారు.

‘హీరామండి’ అనేది తన కెరీర్‌లోనే కష్టతరమైన ప్రాజెక్టు అని సంజయ్ లీలా భన్సాలీ చెప్పారు. ప్రతి ఎపిసోడ్ సినిమా మాదిరిగానే ఉంటుందని తెలిపారు. ఎనిమిది సినిమాలకు పనిచేసినట్టు ఉందని పేర్కొన్నారు. వెబ్‌సిరీస్ కోసం ఎక్కడ రాజీ పడటం లేదని చెప్పారు.

Updated Date - 2023-02-18T17:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising