ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DasaraTeaser: ‘దసరా’ టీజర్ రిలీజ్.. నాని మాస్ లుక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే!

ABN, First Publish Date - 2023-01-30T16:47:55+05:30

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నాని (Nani). ఆయన తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). భారీ బడ్జెట్‌తో రూపొందింది. పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నాని (Nani). ఆయన తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). భారీ బడ్జెట్‌తో రూపొందింది. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. వీర్నపల్లి అనే బొగ్గ గనుల నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. నాని పూర్తిగా మాస్ అవతారంలో కనిపించాడు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రూపొందిచినట్టు అర్థమవుతుంది. సత్యన్ సూర్యన్ విజువల్స్ ఆకట్టుకన్నాయి. సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan)మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేశాడు. టీజర్‌లోని చివరి షాట్.. బొటనవేలిని కోసుకుని రక్తంతో నాని బొట్టు పెట్టుకునే సీన్ అద్భుతంగా ఉంది.

దసరా టీజర్‌ను దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) లాంచ్ చేశారు. ‘‘దసరా విజువల్స్ బాగున్నాయి. నాని మాస్ మేకోవర్ అద్భుతంగా ఉంది. డెబ్యుటెంట్ డైరెక్టర్ ప్రభావం చూపించడం నాకు నచ్చింది. లాస్ షాట్ అయితే తోప్. శ్రీకాంత్ ఓదెల, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని జక్కన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాని కూడా దసరా టీజర్‌ను రిలీజ్ చేస్తూ మార్చి30న థియేటర్స్‌లో కలుసుకుందాం అని చెప్పారు. అంతకు ముందు నాని పోస్ట్ పెడుతూ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ను గుర్తుంచుకొండి అని తెలిపారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌ పాత్రను పోషిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘దసరా’ ను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నాని ఈ చిత్రంలో సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-30T17:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising