ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saindhav: వెంకటేశ్ సినిమాలో స్టార్ హీరో..!

ABN, First Publish Date - 2023-02-20T19:35:47+05:30

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్’ (Saindhav) అని టైటిల్ పెట్టారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్’ (Saindhav) అని టైటిల్ పెట్టారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ మూవీ పలు భాషల్లో విడుదల కానుండటంతో కీలక పాత్రల కోసం ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా నటీనటులను తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు కాగా, మేకర్స్ కీలక పాత్రను మరో స్టార్‌తో చేయించబోతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో ఆర్య (Arya) ‘సైంధవ్’ లో కీలక పాత్రను పోషించనున్నట్టు సమాచారం. ఆ పాత్ర చాలా బలంగా ఉంటుందని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకొనుంది. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితమవుతుంది. ‘కెజియఫ్’ ఫేమ్ శ్రీ నిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించనున్నారని సమచారం అందుతుంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ ఎడిటింగ్ చేయనున్నారు.

Updated Date - 2023-02-20T19:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising