Tech News: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..? ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకోండి చాలు.. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్..!
ABN, First Publish Date - 2023-11-11T11:37:27+05:30
లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలా పలు విషయాల కోసం డైలీ మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాం అంతలోనే ఫోన్ మోగుతుంది. పైగా కొత్త నంబర్ నుంచి ఆ ఫోన్‌కాల్ వస్తుంది.
Spam Calls: లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలా పలు విషయాల కోసం డైలీ మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాం అంతలోనే ఫోన్ మోగుతుంది. పైగా కొత్త నంబర్ నుంచి ఆ ఫోన్‌కాల్ వస్తుంది. దాంతో ఏదో ఇంపార్టెంట్ కాల్ కావొచ్చు అని ఎంతో ఆత్రుతగా లిఫ్ట్ చేస్తాం. తీరా అది కస్టమర్ కేర్ వాళ్లది అయ్యి ఉంటుంది. ఇలాంటి స్పామ్ కాల్ అనుభవాన్ని మనలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. ఇలా చాలాసార్లు మనం బిజీగా ఉన్న సమయంలో స్పామ్ కాల్స్ ఇబ్బందిపెడుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించడానికి చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే చాలు. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్ అవుతాయి.
ఒక విధంగా 'ట్రూకాలర్' (Truecaller) వంటి యాప్‌ని ఉపయోగించి దీన్ని కొంతమేర నివారించవచ్చు. అయితే, ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయినందున మొబైల్ తయారీదారు కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో అంతర్నిర్మితంగా 'ఆటో స్పామ్ కాల్ బ్లాక్' ఫీచర్‌ను అందిస్తున్నాయి. దీన్ని చిన్న సెట్టింగ్స్ ద్వారా మనం మార్చుకుంటే స్పామ్ కాల్స్ బెడద నుంచి బయటపడొచ్చు. అయితే, ఇది ఐఫోన్ (iPhone), ఆండ్రాయిడ్ (Android) మొబైల్స్‌లో వేర్వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్‌ను తెలుసుకుందాం.
Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!
ఐఫోన్‌లో స్పామ్ కాల్స్ బ్లాక్ చేయడం ఇలా..
ఐఫోన్‌లో స్పామ్ కాల్‌లను ఆపడానికి ముందగా మన ఫోన్‌లో ట్రూకాలర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసి, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఫోన్ 'సెట్టింగ్స్'లోకి వెళ్లాలి. అక్కడ 'ఫోన్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే 'కాల్ బ్లాకింగ్ మరియు ఐడెంటిఫికేషన్'ను ఎంచుకోవాలి. అక్కడ ఉండే నాలుగు ఎంపికలను టాగుల్ చేయాలి. ఆ తర్వాత ట్రూకాలర్ యాప్‌ని తెరిచి స్పామ్ డిటెక్టివ్ ఆప్షన్‌ను ఎనబుల్ చేస్తే సరిపోతుంది. ఇది స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయనప్పటికీ, ట్రూకాలర్.. ఫోన్ నంబర్‌ను డేటాబేస్‌తో పోల్చి అది స్పామ్ కాలా? కాదా? అని చెబుతుంది.
ఆండ్రాయిడ్‌లో స్పామ్ కాల్‌లను ఎలా బ్లాక్ చేయాలంటే..
మీకు గూగుల్ (Google) డయలర్‌తో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. వెంటనే యాప్‌ని ఓపెన్ చేయండి. తర్వాత కుడివైపు పైమూలలో ఉండే 'మూడు చుక్కల'పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'సెట్టింగ్'లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే 'కాలర్ ఐడీ మరియు స్పామ్'పై క్లిక్ చేస్తే, 'ఫిల్టర్ స్పామ్ కాల్' ఆప్షన్‌ను ఎనబుల్ చేయాలి. ఇది మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ కాల్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.
Shocking: ఓ నిండు గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైన డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే..!
Updated Date - 2023-11-11T11:37:29+05:30 IST