ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవు పేడ అని తేలిగ్గా తీసి పారేయకండి.. దాంతోనే ఆ కుర్రాడు లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగంటే..

ABN, First Publish Date - 2023-02-12T19:39:41+05:30

కాదేదీ వ్యాపారానికి అనర్హం అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నిరూపించాడు. అందరూ తేలిగ్గా చూసే ఆవు పేడతో (Cow Dung) వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాదేదీ వ్యాపారానికి అనర్హం అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నిరూపించాడు. అందరూ తేలిగ్గా చూసే ఆవు పేడతో (Cow Dung) వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అతడి విజయ గాథ స్థానికంగా ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది. తాజాగా యూపీలో (Uttar Pradesh) జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ఆ యువకుడు హాజరయ్యాడు. రామ్‌పూర్‌కు చెందిన ప్రాంజల్ అగర్వాల్ అనే యువకుడి కథ తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు (Inspirational Story).

ప్రాంజల్ అగర్వాల్ కుటుంబం గత 15 ఏళ్లుగా ఆవు పాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ పెద్ద మొత్తంలో ఆవు పేడ వచ్చేది. 2011కి ముందు ఆ పేడను పొలాల్లో ఎరువుగా ఉపయోగించేవారు. 2011 తర్వాత ప్రాంజల్ ఆ ఆవు పేడతో రకరకాల వస్తువులు తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. ఆవు పేడలో ఇంకేదీ కలపకుండా ఎదైనా వస్తువు తయారు చేస్తే అది విరిగిపోకుండా గట్టిగా ఉంటుందని ప్రాంజల్ తెలుసుకున్నాడు. దాంతో ఆవు పేడను ఉపయోగించి దేవుడు బొమ్మలతో సహా రకరకాల బొమ్మలు (Toys with cow dung) తయారు చేసి విక్రయించడం ప్రారంభించాడు. ముందుగా ఆవు పేడతో లక్ష్మీ గణేష్ విగ్రహం తయారు చేశాడు. ఆ బొమ్మలకు స్థానికంగా మంచి ఆదరణ లభించింది.

రాంపూర్ మార్కెట్‌లో ప్రాంజల్ వస్తువులు మార్మోగాయి. ప్రస్తుతం ఇతర జిల్లాల్లో కూడా వాటికి డిమాండ్ పెరిగింది. దీంతో ప్రాంజల్ గైవాలా.కామ్ (Gaiwala.com) పేరుతో వెబ్‌సైట్‌ను తయారు చేసి, దాని ద్వారా తన వస్తువులను బ్రాండ్ చేయడం ప్రారంభించాడు. ఆవు పేడతో ఇంట్లో పెట్టుకునే బొమ్మలు, దేవుడి విగ్రహాలు, ప్రమిదలు, తాళపు ఉంగరాలు, చెప్పులు, అగరబత్తులు తయారు చేయడం ప్రారంభించారు. మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఏడాదికి రూ.20 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. లక్నోలోని ఇన్వస్టర్స్ సమ్మిట్‌లో (UP Investors Summit) ప్రాంజల్ తన ఉత్పత్తులతో ఓ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. దానికి మంచి ఆదరణ లభిస్తోంది.

Updated Date - 2023-02-12T19:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising