ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలకు రూ.1.50 లక్షలు సంపాదిస్తున్న గృహిణి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌ నుంచి తీసేశారు.. భర్త, పిల్లలతో సహా సొంతూరికి తిరిగొచ్చాక..

ABN, First Publish Date - 2023-03-08T16:53:07+05:30

ఆ మహిళ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఇండోర్‌లో నివసించేది.. ఆమె భర్తకు ఓ వస్త్ర దుకాణం ఉండేది.. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆ మహిళ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఇండోర్‌లో నివసించేది.. ఆమె భర్తకు ఓ వస్త్ర దుకాణం ఉండేది.. అయితే కరోనా వారి జీవితాలను అల్లకల్లోలంగా మార్చేసింది.. భర్త వ్యాపారం మూలన పడింది.. ఆమె కూడా ఉద్యోగం పోగొట్టుకుంది.. దీంతో ఇండోర్‌లో చేసేదేం లేక సొంతూరికి మకాం మార్చేసింది.. అక్కడ ఆమె డెయిరీ ఫామ్ ప్రారంభించి నెలకు లక్షలు సంపాదిస్తోంది.. అంతేకాదు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రాజ్‌గఢ్ జిల్లాలోని కిలోడా గ్రామానికి చెందిన పాయల్ పాటిదార్ కథ తెలుసుకుందాం (Inspirational Story).

పాయల్ తన భర్త, ఇద్దరు కుమార్తెలు జాన్వి (6), పహర్ (3)తో కలిసి ఇండోర్‌లో (Indore) నివసించేది. అక్కడ ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేది. ఇండోర్‌‌లోనే భర్త బట్టల వ్యాపారం చేసేవాడు. కరోనా కాలంలో ఆ దుకాణం మూతపడింది. పాయల్ ఉద్యోగం కూడా పోయింది. దీంతో కుటుంబమంతా స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయింది. అక్కడ ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా పాయల్‌ పాల వ్యాపారం (Dairy Business) చేయాలని నిర్ణయించుకుంది. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత, గుజరాత్‌లోని దేశీయ గిర్ జాతికి చెందిన ఆవులను కొనాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. 10 గిర్ జాతి ఆవులను దిగుమతి చేసుకుని డెయిరీని ప్రారంభించారు.

భర్త గదిలో కరెన్సీ నోట్ల కట్టలు.. ఆశగా వెళ్లి వాటిని చూడగానే ఆ భార్యకు డౌట్.. దొంగ నోట్లేనని ఆమె గుర్తించడంతో..

ఆవు పాలను (Cow Milk) అమ్మడమే కాకుండా స్వచ్ఛమైన, కల్తీ లేని నెయ్యి కూడా తయారు చేయడం ప్రారంభించారు. ఆవు పేడ ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆవు పాలు, నెయ్యి, పేడ ఉత్పత్తులను షాజాపూర్, ఇండోర్‌లకు సరఫరా చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వారి దగ్గర 50కి పైగా ఆవులున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అంతేకాదు గ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు.

Updated Date - 2023-03-08T16:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising