ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: అయ్య బాబోయ్.. ఇది బాత్రూంలోకి ఎలా వచ్చిందబ్బా..? స్నానం చేసేందుకు వెళ్లిన ఆ వ్యక్తి లోపల దాన్ని చూసి షాక్..!

ABN, First Publish Date - 2023-08-07T15:11:16+05:30

ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే నవ్వుతూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బాత్రమ్‌కు వెళ్లాడు. అక్కడ బాత్‌టబ్‌లో ఉన్న అడవి జంతువును చూసి షాకయ్యాడు. దీంతో వారి ఆనందం కాస్తా ఆవిరైంది.

ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే నవ్వుతూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బాత్రమ్‌కు వెళ్లాడు. అక్కడ బాత్‌టబ్‌లో ఉన్న అడవి జంతువు (Wild Animal)ను చూసి షాకయ్యాడు. దీంతో వారి ఆనందం కాస్తా ఆవిరైంది. ఈ ఘటన స్కాట్లాండ్ (Scotland) రాజధాని ఎడిన్‌బర్గ్‌లో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ నక్క పిల్ల (Fox Cub) వారి ఇంట్లోకి ప్రవేశించి బాత్‌టబ్‌లో తలదాచుకుంటోంది.

ఎడిన్‌బర్గ్‌ (Edinburgh)లోని ఓర్మిడేల్ టెర్రేస్‌లో నివసిస్తున్న ఓ కుటుంబం ఇంట్లోని బాత్‌టబ్‌లో చిన్న నక్క పిల్లను చూసి ఆశ్చర్యపోయింది. వారు వెంటనే స్కాటిష్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (SSPCA)కి ఫోన్ చేసి విషయం చెప్పారు. అధికారులు ఆ నక్క పిల్లను రక్షించి తీసుకెళ్లి అడవుల్లో వదిలిపెట్టారు. ఆ నక్క ఆరోగ్యంగానే ఉందని, కాకపోతే కాస్త భయాందోళనకు గురైందని అధికారి తెలిపారు.

Viral News: ఒకే బాత్రూంలో ఇరుక్కుపోయిన కుక్క, చిరుతపులి.. చివరకు ఏం జరిగి ఉంటుందో కలలో కూడా ఊహించలేరు..!

ఎడిన్‌బర్గ్‌లోని ఇళ్లలోకి నక్కలు ఇలా ప్రవేశించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. నాటింగ్‌హామ్‌షైర్‌కు చెందిన లిజ్ రెన్షా అనే వ్యక్తి ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రాంతంలో నక్క, దాని 8 మంది పిల్లలు కనిపించాయి. తలుపులు తెరిచి ఉంచితే నక్కలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని చాలా మంది ఎప్పుడూ లాక్ చేసుకునే ఉంటున్నారు.

Updated Date - 2023-08-07T15:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising