ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Success Story: కాళ్లూ చేతులూ పనిచేయవు.. పుట్టినప్పటి నుంచీ కుర్చీకే పరిమితం.. అయినా 3 ప్రభుత్వోద్యోగాలకు సెలెక్ట్..!

ABN, First Publish Date - 2023-04-14T16:00:58+05:30

పుట్టిన మూడు నెలలకే కాళ్లూ చేతులూ పనిచేయకపోయినా ఈ కుర్రాడు తన జీవితంలో ఓడిపోకూడదని నిర్ణయించుకున్నాడు. ముక్కుతో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఆపరేట్(Mobile, Laptop operate with nose) చేస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

'సాధనాత్ సాధ్యతే సర్వం' అన్నది పెద్దలు చెప్పిన మాట. ప్రయత్నం చేస్తే ఎవరైనా, ఏదైనా సాధించగలరు. దీనికి కావాల్సింది సంకల్ప బలం మాత్రమే.. స్టీఫెన్ హాకింగ్(Stephen Hawking) గురించి ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. శరీరం మొత్తం చచ్చుబడినా కేవలం దవడ ఎముక కదలికల ద్వారా కమ్యూనికేషన్ చేస్తూ కృష్ణబిలాల(black holes) గురించి పరిశోధనలు చేశాడు. నిజానికి ఇలా శారీరకంగా లోపమున్న(Physical defect)వారిలోనే సంకల్పబలం ఎక్కువగా ఉంటుందేమో.. పుట్టిన మూడు నెలలకే కాళ్లూ చేతులూ పనిచేయకపోయినా ఈ కుర్రాడు తన జీవితంలో ఓడిపోకూడదని నిర్ణయించుకున్నాడు. ముక్కుతో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఆపరేట్(Mobile, Laptop operate with nose) చేస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాడు. అలా ఇంటర్ పాసయ్యి అవగానే .. ఒకటి రెండూ కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు(Three government jobs) సెలక్ట్ అయ్యాడు. అసలింతకూ ఈ కుర్రాడెవరు? ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి? తెలుసుకుంటే..

గుజరాత్(Gujarat) రాష్ట్రం రాజ్ కోట్(Rajkot) లో స్మిత్ అనే కుర్రాడు ఉన్నాడు. ఇతను పుట్టినప్పుడు బానే ఉన్నాడు కానీ మూడు నెలల వయసులో నరాల సంబంధిత(Nerve problems) సమస్య చుట్టుముట్టింది. పిల్లాడి ఆరోగ్యం బాగుచేయించడానికి గుజరాత్ నుండి ముంబైకి(Gujarat to Mumbai) లెక్కలేనన్నిసార్లు తిరిగారు, బోలెడు వైద్యులకు చూపించారు ఇతని తల్లిదండ్రులు. కానీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో మరొక బిడ్డ పుడితే స్మిత్ ను సరిగా చూసుకోలేమని భావించి మళ్ళీ పిల్లల్ని వద్దనుకున్నారు. స్మిత్ ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చేతులూ కాళ్ళూ పనిచేయకపోయినా స్మిత్ మెదడు మాత్రం పదునైనది. ఏదైనా ఇట్టే గ్రహించగలడు. తొందరగా నేర్చుకోగలడు, తన ప్రతిభతో చదువులో గొప్పగా రాణిస్తున్నాడు.

Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..


చిన్నప్పటి నుండి ఇతని తల్లి స్నానం చేయించడం దగ్గరనుండి రెడీ చేయడం, స్కూలుకు తీసుకెళ్ళడం చేసేది. తండ్రి స్మిత్ కు అవసరమైనవన్నీ సమకూర్చేవాడు. దీంతో స్మిత్ కు తనలో లోపం ఉందన్నట్టే అనిపించేది కాదు. గత ఏడాది ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాల్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాడు(State third rank in inter board results). శారీరక వికలాంగ పిల్లలో మొదటి ర్యాంక్ ఇతనిదే. ముక్కుతో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ చక్కగా ఆపరేట్ చేయగలడు, చకాచకా టైప్ చేయగలడు. భారతదేశంలో అలా ముక్కుతో మొబైల్, ల్యాప్టాప్ ఆపరేట్ చేయగలిగిన వ్యక్తి ఇతనొక్కడే.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ముంగిట్లో వాలినా చేతులారా వాటిని వదిలేసి యూపీయస్సీ(UPSC) సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఈ రాజ్ కోట్ కుర్రాడు. ఇతని మాటలు 18ఏళ్ళ కుర్రాడు మాట్లాడినట్టు ఉండవు, ఏ మధ్యవయస్కుడో జీవితానుభవాలు చెబుతున్నట్టు అనిపిస్తుంది. సమస్యలను ఎంతో సులువుగా అధిగమిస్తున్న ఇతను ఎందరో స్పూర్తిగా నిలుస్తున్నాడు.

Onions: వామ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలో అని సంబరపడ్డాం.. కానీ ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..


Updated Date - 2023-04-14T16:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising