Sukesh Chandrasekhar: ‘నోరాకి జాక్వెలిన్ అంటే అసూయ.. 2 కోట్ల విలువైన..’

ABN, First Publish Date - 2023-01-22T13:22:16+05:30

గత కొంతకాలంగా 200 కోట్ల దోపిడీ కేసుకి సంబంధించిన విచారణ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.

Sukesh Chandrasekhar: ‘నోరాకి జాక్వెలిన్ అంటే అసూయ.. 2 కోట్ల విలువైన..’
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొంతకాలంగా 200 కోట్ల దోపిడీ కేసుకి సంబంధించిన విచారణ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో దానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నోరా ఫతేహి (Nora Fatehi)కి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) అంటే అసూయ అని సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) విచారణలో తెలిపాడు. ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అందులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఎప్పుడూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై అసూయపడేదని ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ తెలిపినట్లు పేర్కొంది.

nora1.jpg

దీనికి సంబంధించి సుకేశ్ తరుఫున అతని లాయర్లు అనంత్ మాలిక్, ఎకే సింగ్ తాజాగా ఓ ప్రెస్ స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో.. ‘నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేది. నేను కాల్‌కి సమాధానం ఇవ్వకపోతే ఆమె నాకు కాల్ చేస్తూనే ఉండేది. నేను, జాక్వెలిన్ ఘాడమైన రిలేషన్‌షిప్‌లో ఉండి నోరాని ఎవైడ్ చేయడం ప్రారంభించాను. కానీ ఆమె నాకు కాల్స్ చేస్తూ చికాకు కలిగించేది. అంతేకాకుండా తన బంధువు బాబీ మ్యూజిక్ బ్యాండ్‌ని ప్రారంభించడానికి సహాయం చేయమని కోరింది. అంతేకాకుండా తనకు కావాల్సిన హీర్మేస్ బ్యాగ్‌లు, ఆభరణాలకి సంబంధించిన పిక్స్‌ని పంపగా.. నేను కొనిచ్చాను. వాటిని ఆమె ఇప్పటికీ ఉపయోగిస్తోంది. వాటికి సంబంధించిన బిల్లులు చూపించమని ఆమెని అడగండి. చూపించలేదు. ఎందుకంటే ఆ బ్యాగ్‌ల విలువ రూ. 2 కోట్ల కంటే ఎక్కువ’ అని సుకేశ్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-01-22T13:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising