Superstar Krishna, Mahesh Babuపై ఆ కుటుంబం చూపే ప్రేమను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN, First Publish Date - 2023-02-16T11:32:33+05:30

సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) అంటే ఆ కుటుంబానికి ఎంతో అభిమానం. ఇంట్లో ఏ శుభకార్యమైనా కృష్ణ, మహేష్ బాబు(Mahesh Babu) ఫోటోలు

Superstar Krishna, Mahesh Babuపై ఆ కుటుంబం చూపే ప్రేమను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) అంటే ఆ కుటుంబానికి ఎంతో అభిమానం. ఇంట్లో ఏ శుభకార్యమైనా కృష్ణ, మహేష్ బాబు(Mahesh Babu) ఫోటోలు ఉండాల్సిందే. అంత అభిమానం ఆయన అంటే. కృష్ణ చనిపోయిన సరే..అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. వారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి శుభలేఖలపై కృష్ణ ఫోటోలను ముద్రించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏలూరు జిల్లాకు జంగారెడ్డిగూడెంకు చెందిన భవిరి శెట్టి మురళీకృష్ణ 40 ఏళ్లుగా జ్యూస్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Untitled-1555.jpg

ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతో అభిమానం. కృష్ణ చెన్నైలో నివాసం ఉండే సమయంలో మురళీ కృష్ణకు ఆయనకు అనుంబంధం ఏర్పడింది. తర్వాత కృష్ణ చెన్నై నుంచి హైదరాబాద్‎కు మకాం మార్చాక అనుంబంధం మరింత పెరిగింది. దాంతో తమ కుటుంబ సభ్యులను తరచుగా కృష్ణ దగ్గరికి తీసుకెళ్లేవాడు. మురళీ కృష్ణపై కృష్ణకు, కృష్ణ ఫ్యామిలీపై అభిమానం రెట్టింపు అయిపోయింది. అది ఎంతవరకు అంటే..తన కుమారుల పెళ్లి శుభలేఖల్లో కృష్ణ, మహేష్ బాబు ఫోటోలను ముద్రించే స్థాయికి చేరింది. 2012లో పెద్ద కుమారుడు, 2019లో చిన్న కుమారుడు పెళ్లి పత్రికలపై కృష్ణ, మహేష్ ఫోటోలను వేశారు. అయితే.. ఈ నెలలో మురళీ కృష్ణ మూడో కుమారుడి పెళ్లి కూడా ఉంది.

ప్రస్తుతం కృష్ణ బ్రతికి లేకపోయినా..ఆయనపై ఉన్న అభిమానంతో శుభలేఖలపై కృష్ణ, మహేష్ ఫోటోలను ముద్రించారు. వాటిని బంధుమిత్రులకు పంపిణీ చేస్తున్నారు. ఘట్టమనేని కుటుంబంతో ఉన్న అనుబంధం వల్లే తానూ ఇలా చేస్తున్నానని, ప్రతి ఏడాది విజయ నిర్మల పుట్టిన రోజుకు కుటుంబం మొత్తాన్ని కృష్ణ ఆహ్వానించేవారని మురళీ కృష్ణ తెలిపారు. ఇదీ ఒక సినీనటుడు కృష్ణపై ఒక కుటుంబం చాటుకుంటున్న అభిమానం. అభిమానానికి ఏల్లలు అనడానికి వీరే ఒక ఉదాహరణ.

Updated Date - 2023-02-16T12:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising