ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pradeep Ranganathan: సూపర్‌స్టార్ల‌కి కథ చెప్పిన యువ దర్శకుడు!?

ABN, First Publish Date - 2023-02-13T10:46:41+05:30

గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘లవ్ టుడే’ (Love Today) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ కోలీవుడ్ (Kollywood) మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది.

Pradeep
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘లవ్ టుడే’ (Love Today) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ కోలీవుడ్ (Kollywood) మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో దర్శక నటుడు ప్రదీప్ రంగనాథన్‌ (Pradeep Ranganathan)కి మంచి పాపులారిటీ వచ్చింది. నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుతూ.. ఇతర యువ దర్శకులతో పోటీపడుతూ తన ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఆ కోవలోనే ఆయన వరుసగా రెండు హిట్‌ చిత్రాలు అందించారు. ఈ రెండూ కూడా థియేటర్‌లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం గమనార్హం.

జయం రవి హీరోగా 2019లో ‘కోమాలి’ (Comali) అనే సినిమాకి ప్రదీప్ మొదటిసారి దర్శకత్వం వహించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని వంద రోజులు పూర్తి చేసుకుంది. అలాగే, గత ఏడాది తాను దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘లవ్‌టుడే’ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. ఒక్క తమిళంలోనేకాకుండా, తెలుగులోకి అనువాదం చేయగా అక్కడ కూడా నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఓటీటీల కాలంలో సినిమా థియేటర్‌లో ఎక్కువ రోజులు ప్రదర్శించబడటం అంటే సాధారణం కాదు. కానీ, ‘లవ్‌టుడే’ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఆయన చేపట్టే తదుపరి ప్రాజెక్టుపై సస్పెన్స్‌ నెలకొంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పాటు పలువురు అగ్రహీరోలకు ఆయన కథ వినిపించారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు తదుపరి చిత్రంలోనూ ఆయనే హీరోగా నటించనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంతవరకూ ప్రదీప్ స్పందిచలేదు.

ఇది కూడా చదవండి: Anikha Surendran: డైలాగుల విషయంలో చాలా కష్టపడ్డా

Updated Date - 2023-02-13T10:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising