ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడి ప్రాంగణంలో మీ లొకేషన్ ఉంది.. మటన్ కుర్మాను ఇవ్వనన్న డెలివరీ బాయ్.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఫైర్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-03-08T17:19:03+05:30

డెలివరీ ఐటమ్ తీసుకుని లొకేషన్ ఆధారంగా బయల్దేరిన డెలివరీ బాయ్ గుడి దగ్గరకు చేరుకుని షాకయ్యాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇప్పట్లో ఎవరికైనా ఏదైనా తినాలనిపిస్తే సింపుల్ గా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లలో ఆర్డర్ పెట్టుకుంటారు. ఓ వ్యక్తికి మటన్ కూర్మా తినాలనిపించి స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. అతని ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్, దగ్గర్లో గుడి ఉండటం చూసి నేను ఆర్ఢర్ డెలివరీ ఇవ్వనంటూ భీష్మించుకున్నాడు. సదరు కస్టమర్ స్విగ్గీ కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసి నా ఆర్డర్ డెలివరీ ఇవ్వలేదంటూ చిటపటలాడాడు. దీంతో స్విగ్గీ సంస్థ ఆ డెలివరీ బాయ్ విషయంలో అగ్గిమీద గుగ్గిలమయ్యింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక రెస్టారెంట్ కు స్విగ్గీ నుండి మటన్ కూర్మా, నాన్ ఆర్డర్ వచ్చింది. డెలివరీ ఐటమ్ తీసుకుని లొకేషన్ ఆధారంగా బయల్దేరిన డెలివరీ బాయ్ మర్ఘట్ లోని బాబా హనుమాన్ టెంపుల్ ప్రాంతానికి చేరుకున్నాడు. గుడిపక్కనే ఉన్న కచోరి షాప్ దగ్గర లొకేషన్ పాయింట్ అయింది. దీంతో డెలివరీ బాయ్ షాకయ్యాడు. మటన్ కూర్మా ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కు కచోరి షాప్ ఉంది.ఆ షాప్ లో ప్రతిరోజూ స్వీట్లు, నైవేద్యాలు, కచోరీలు తయారు చేస్తారు. గుడికి వచ్చే భక్తులు ఆ షాప్ నుండి స్వీట్లు, కచోరీలు తీసుకెళ్ళి గుడిలో దేవుడికి నైవేద్యం పెడతారు. అది అర్థం చేసుకున్న డెలివరీ బాయ్ ఆ కస్టమర్ కు మటన్ కూర్మా డెలివరీ ఇవ్వడానికి నిరాకరించాడు. స్విగ్గీ అధికారులకు ఫోన్ చేసి తను ఆ డెలివరీ ఇవ్వనని, ఎందుకు ఇవ్వలేక పోతున్నాననే కారణం కూడా వివరించాడు. అయితే వ్యాపారం మాత్రమే ముఖ్యం అనుకున్న కంపెనీ వారు ఆ డెలివరీ బాయ్ తో ఫుడ్ డెలివరీ ఇచ్చి రమ్మని చెప్పారు. దీని తరువాత ఆ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తితో మాట్లాడాడు. అతను కస్టమర్ తో మీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పాడు. 'నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు, నేను ఆర్డర్ ఇచ్చాక దాన్ని తెచ్చివ్వడానికి నీకేంటి ప్రాబ్లెం?' అని ఫైర్ అయ్యాడు ఆ కస్టమర్.

Read also:సైబీరియన్ పక్షుల గురించి షాకింగ్ నిజం.. ఇవి ఇంత పని చేస్తాయంటే ఆశ్చర్యం వేస్తుంది..


డెలివరీ బాయ్ సదరు వ్యక్తితో 'భయ్యా ఇది గుడి లొకేషన్, నేను ఈ లొకేషన్ లో డెలివరీ ఇవ్వను. మీరు షాపులో దేవుడికోసం ప్రసాదాలు తయారుచేసి అమ్ముతారు, కానీ అదే షాపులోకి మటన్ కూర్మా తీసుకెళతారా! ఇది చాలా తప్పు భయ్యా.. నేను మీ ఆర్డర్ డెలివరీ ఇవ్వలేను క్యాన్సల్ చేసుకోండి' అని చెప్పాడు. 'నేను ఏడాదిలో 365రోజులూ ఇలాగే ఆర్డర్ చేస్తాను, నువ్వు కొత్తగా డెలివరీ ఇవ్వనంటున్నావ్' అని ఆ కస్టమర్ డెలివరీ బాయ్ మీద చిందులు వేశాడు. డెలివరీ బాయ్ మాత్రం ఆర్డర్ ఇవ్వకుండానే వెనక్కు వెళ్ళిపోయాడు. దీంతో కోపం తెచ్చుకున్నసదరు కస్టమర్ స్విగ్గీ కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసి నా ఆర్డర్ డెలివరీ ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యాడు. ఒక కస్టమర్ చేజారిపోతారనే కంగారులో స్విగ్గీ సదరు డెలివరీ బాయ్ ను జాబ్ లో నుండి తొలగించింది. ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ గుడి సంఘం వారు ఆ డెలివరీ బాయ్ ను పిలిచి మంచిపని చేశావంటూ సన్మానం చేశారు. అతని ఉద్యోగం తిరిగి వచ్చేలా చేస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్ఛనీయాంశంగా మారింది.

Updated Date - 2023-03-08T17:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising